Manu Bhaker: అలా చేస్తే ఊరుకోం.. లీగల్ నోటీసులకు సిద్ధం కండి: మను భాకర్ స్ట్రాంగ్ వార్నింగ్

|

Jul 31, 2024 | 12:42 PM

Indian Athlete Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి రెండు కాంస్య పతకాలు సాధించిన భారత అగ్రశ్రేణి పిస్టల్ షూటర్ మను భాకర్.. మైదానం వెలుపల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 కాంస్య పతకాలు సాధించిన తరుణంలో చాలా బ్రాండ్‌లు ఆమె విజయాలకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి చాలా బ్రాండ్‌లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మను భాకర్ ఫొటోలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Manu Bhaker: అలా చేస్తే ఊరుకోం.. లీగల్ నోటీసులకు సిద్ధం కండి: మను భాకర్ స్ట్రాంగ్ వార్నింగ్
Manu Bhaker
Follow us on

Indian Athlete Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి రెండు కాంస్య పతకాలు సాధించిన భారత అగ్రశ్రేణి పిస్టల్ షూటర్ మను భాకర్.. మైదానం వెలుపల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 కాంస్య పతకాలు సాధించిన తరుణంలో చాలా బ్రాండ్‌లు ఆమె విజయాలకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి చాలా బ్రాండ్‌లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మను భాకర్ ఫొటోలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం, భారతీయ షూటర్‌తో అధికారికంగా సంబంధం లేని వ్యక్తులు, బ్రాండ్‌లు సోషల్ మీడియాలో అభినందనల ప్రకటనలు జారీ చేసే హక్కు లేదంటూ మను భాకర్ సూచించింది.

IOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరవ్ తోమర్ ది ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ, ‘మనుతో సంబంధం లేని దాదాపు రెండు డజన్ల బ్రాండ్‌లు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలతో అభినందనల ప్రకటనలను విడుదల చేశాయి. ఇది అనధికార మార్కెటింగ్‌కి దారి తీస్తుంది. ఈ బ్రాండ్‌లకు చట్టపరమైన నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. పారిస్ గేమ్స్‌లో ఇతర భారతీయ అథ్లెట్లు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఆయా అథ్లెట్లతో అనుబంధం లేని బ్రాండ్‌లతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ఓ సంస్థ ప్రతినిధి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బేస్‌లైన్ వెంచర్స్ మాట్లాడుతూ, ‘మా అథ్లెట్‌లను స్పాన్సర్ చేయని బ్రాండ్‌లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వారి ఫొటోలను ఉపయోగించలేరు. అలా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చారు.

పారిస్‌ గేమ్స్‌లో మను భాకర్ చరిత్ర..

స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా భారత స్టార్ షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. భారత జోడీ 16-10తో కొరియాకు చెందిన లీ వోన్హో, ఓహ్ యే జిన్‌లను ఓడించి ఈ ఒలింపిక్స్‌లో దేశానికి రెండో పతకాన్ని అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో, మను తన పిస్టల్‌లో లోపం కారణంగా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..