Jyothi Surekha: సరికొత్త జాతీయ రికార్డును సొంతం చేసుకున్న తెలుగు తేజం.. ఆర్చరీ వరల్డ్ కప్ కోసం..
Jyothi Surekha Set New Record: తెలుగు తేజం, ఇంటర్నేషనల్ ఆర్చర్ వెన్న జ్యోతి సురేఖ తాజాగా అరుదైన జాతీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఆర్చరీ వరల్డ్ కప్ కోసం నిర్వహించిన సెలెక్షన్...
Jyothi Surekha Set New Record: తెలుగు తేజం, ఇంటర్నేషనల్ ఆర్చర్ వెన్న జ్యోతి సురేఖ తాజాగా అరుదైన జాతీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఆర్చరీ వరల్డ్ కప్ కోసం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. హరియాణాలోని సోనేపట్‌లో మంగళవారం జరిగిన ఈ ట్రయల్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ ర్యాంకింగ్ రౌండలో సురేఖ 720కి గాను 710 పాయింట్లు స్కోర్ చేసి నూతన అధ్యయనానికి తెర తీసింది. ఈ అరుదైన ఘనత సాధించిన జ్యోతి జాతీయ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే గతేడాది తన పేరిటే ఉన్న 709/720 రికార్డును తానే తిరగరాసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సెలెక్షన్స్ టోర్నీ మంగళవారంతో పూర్తయింది. ఇదిలా ఉంటే రౌండ్ రాబిన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు నెగ్గిన సురేఖ.. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా 8 మంది అత్యుత్తమ క్రీడాకారిణులకు నిర్వహించిన ర్యాంకింగ్ రౌండ్‌లో 2808/2880తో సురేఖ ప్రథమ స్థానం సాధించింది. మరి వరల్డ్ కప్‌లో తెలుగు క్రీడాకారిణి భారత ఖ్యాతిని చాటుతుందో చూడాలి. ఇక జ్యోతి సురేఖ కెరీర్ విషయానికొస్తే.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం లోని నడింపల్లి గ్రామంలో జన్మించిన సురేఖ చిన్న వయసులో ఆర్చరీలో తనదైన ప్రతిభను కనబరిచింది. జ్యోతి నాలుగేళ్ల వయసులోనే కృష్ణ నదిలో 5 కి.మీ దూరాన్ని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల్లోకెక్కింది. ఇక 13 ఏళ్ల వయసులోనే తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై ఈ ‘జ్యోతి’ వెలిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరగని జ్యోతి.. 2009 లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెలుచుకుంది.
Also Read: Bumrah wedding: పెళ్లి కళ వచ్చేసింది..! అందుకే మ్యాచ్‌లకు దూరం.. పూర్తి వివరాలు ఇవే