AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ESP: తొలిరోజే స్పెయిన్‌తో ఢీ కొట్టేందుకు సిద్ధం.. విజయంతో భారత్ ముందుకు సాగేనా.. మ్యాచ్ ఎప్పుడంటే?

India vs Spain Hockey World Cup 2023: భారత్ వర్సెస్ స్పెయిన్ జట్లు చివరిసారిగా 2014లో ప్రపంచ కప్‌లో పరస్పరం తలపడ్డాయి. ఆ తర్వాత మ్యాచ్ 1-1తో డ్రా అయింది.

IND vs ESP: తొలిరోజే స్పెయిన్‌తో ఢీ కొట్టేందుకు సిద్ధం.. విజయంతో భారత్ ముందుకు సాగేనా.. మ్యాచ్ ఎప్పుడంటే?
Indian Hockey Team
Venkata Chari
|

Updated on: Jan 13, 2023 | 8:05 AM

Share

Hockey World Cup 2023: భారత హాకీ జట్టు శుక్రవారం హాకీ ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది . అభిమానులతో నిండిన స్టేడియంలో గెలిచి ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేయాలని కోరుకుంటుంది. 1975 తర్వాత భారత్ ప్రపంచకప్ గెలవలేదు. ఈసారి టోర్నీలో పెద్ద పోటీదారుగా అడుగుపెట్టనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. ఇప్పుడు ప్రపంచకప్‌లో 48 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని కోరుకుంటోంది.

హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో ఉన్న భారత జట్టు ఈసారి సొంత గడ్డపై బలమైన పతక పోటీదారులలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-4 తేడాతో ఓడిపోయినప్పటికీ మంచి ప్రదర్శన కనబరిచింది. గ్రాహం రీడ్ జట్టు ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఒక మ్యాచ్‌లో ఓడించి ఆరేళ్ల తర్వాత వారిపై విజయం సాధించింది. 2021-22 సీజన్‌లో ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత్ మూడో స్థానాన్ని సాధించింది.

భారత జట్టులో కీలక ఆటగాళ్లు..

రీడ్ 2019లో కోచ్‌గా మారినప్పటి నుంచి అంతర్జాతీయ హాకీలో భారత్ స్థాయి పెరిగింది. రీడ్ ఆటగాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాడో, అదే పొందుతూ, దూసుకెళ్తున్నాడు. FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ డ్రాగ్-ఫ్లికర్లలో ఒకడిగా పేరుగాంచాడు. వీరితో పాటు అనుభవజ్ఞులైన గోల్ కీపర్లు పీఆర్ శ్రీజేష్, మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్ దీప్ సింగ్ లు విజయానికి బాధ్యత వహిస్తారు. డిఫెండర్ అమిత్ రోహిదాస్ కూడా చాలా అనుభవజ్ఞుడు. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ కూడా. అందరి చూపు కూడా ఫార్వర్డ్ ఆకాష్‌దీప్ సింగ్‌పైనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భారత్ విజయంతో ఆరంభించాలని..

భారత్ శుక్రవారం, జనవరి 13న స్పెయిన్‌తో తలపడుతుంది. ఆతిథ్య జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడానికి విజయంతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు ఉంటాయి. క్రాస్ ఓవర్ ద్వారా చివరి ఎనిమిదికి చేరుకుంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ బెల్జియం వంటి కఠినమైన జట్లను ఎదుర్కోవచ్చు.

అనుభవం లేని స్పెయిన్ జట్టు..

స్పెయిన్ 1971, 1998లో రన్నరప్‌గా నిలిచింది. 2006లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అర్జెంటీనాకు చెందిన మాక్స్ కాల్డాస్ కోచింగ్, అల్వారో ఇగ్లేసియాస్ కెప్టెన్సీలో గతేడాది అక్టోబర్‌లో భువనేశ్వర్‌లో జరిగిన ప్రో లీగ్ మ్యాచ్‌ల తొలి మ్యాచ్‌లో స్పెయిన్ 3-2తో భారత్‌ను ఓడించింది. రెండో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రో లీగ్ మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో స్పెయిన్ 5-3తో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత్ 5-4తో విజయం సాధించింది. 1948 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్‌పై 30 మ్యాచ్‌లు ఆడిన భారత్ 13 మ్యాచ్‌లు గెలుపొందగా, స్పెయిన్ 11 మ్యాచ్‌లు గెలిచి ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అల్వారో మాట్లాడుతూ, మా ఆటగాళ్లు చాలా మంది మొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్నారు. అయితే మేం ఎవరికీ భయపడం. మా శైలిలో ఆడతాం, ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు