Video: లైవ్ మ్యాచ్‌లో ఆటగాడి తలపై పడిన పిడుగు.. షాకింగ్ వీడియో చూస్తే కన్నీళ్లే..

Lightning in a Indonesia Football Match: ఇండోనేషియా ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం గత 12 నెలల్లో ఇది రెండోసారి. 2023లో సోరాటిన్ U-13 కప్ సందర్భంగా తూర్పు జావాలోని బోజోంగోరోలో ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న ఆటగాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 20 నిమిషాల పాటు ప్రయత్నించిన వైద్యులు అతడిని స్పృహలోకి తీసుకురావడంలో విజయం సాధించారు.

Video: లైవ్ మ్యాచ్‌లో ఆటగాడి తలపై పడిన పిడుగు.. షాకింగ్ వీడియో చూస్తే కన్నీళ్లే..
Lightning in a Indonesia Football MatchImage Credit source: @githii-twitter
Follow us

|

Updated on: Feb 12, 2024 | 5:00 PM

Lightning in a Indonesia Football Match: మరణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం హార్ట్ ఎటాక్‌లతో కూర్చున్న వాళ్లు, కూర్చున్నట్లు, ఆడుతున్నవాళ్లు ఆడుతున్నట్లే చనిపోతున్నారు. అయితే, పిడుగులు పడడం వల్ల కూడా కొంతమంది మరణిస్తుంటారు. కొంతమంది మాత్రం పిడుగులు పడినా, బతికి బయటపడుతున్నారు. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన ఓ వీడియో అందర్ని కన్నీళ్లు పెట్టించేలా చేస్తోంది. గత శనివారం పశ్చిమ జావాలోని సిలివాంగి స్టేడియంలో ప్రతికూల వాతావరణం మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనే ఆటగాడి తలపై పిడుగు పడడంతో మైదానంలో పడిపోయాడు. ఊహించని ఈ ఘటన అందరినీ కలచివేసింది. పక్కనే ఉన్న సహచరులంతా అతడిని ఆసుపత్రికి తరలించే సమయానికి మరణించాడు. ఈ తతంగమంతా స్టేడియంలో అమర్చిన కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చనిపోయిన వ్యక్తి FC బాండుంగ్ వర్సెస్ FBI షుబాంగ్ మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో భాగమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా, మైదానంలో కొంతదూరంలో నిలబడి ఉన్న ఆటగాడిపై అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతితో కూడిన మెరుపు పడింది.

ఈ సమయంలో మంటలు కూడా చెలరేగాయి. పిడుగుపాటుకు గురైన ఆటగాడు వెంటనే నేలపై పడిపోయాడు. అయితే, పిడుగుపాటు కారణంగా దూరంగా నిలబడి ఉన్న ఇతరులు కూడా మైదానంలో కూర్చుండిపోయారు. మిగతా వారంతా తమను తాము రక్షించుకోవడానికి నేలపై పడుకున్నారు. కొందరు బయట పరిగెత్తడం ఈ వీడియోలో చూడొచ్చు.

లైవ్ మ్యాచ్‌లో పిడుగు..

కొన్ని నిమిషాల తర్వాత, అంతా సర్దుకుకంది. ఆ వెంటనే ఆటగాళ్లందరూ మెరుపు కారణంగా అపస్మారక స్థితిలో ఉన్న తమ సహచరుడి వైపు పరిగెత్తారు. అతనిని మేల్కొలపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడంట. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి చేరుకోగానే ఆటగాడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

గత 12 నెలల్లో పిడుగుపాటుకు గురైన రెండో ఘటన..

ఇండోనేషియా ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం గత 12 నెలల్లో ఇది రెండోసారి. 2023లో సోరాటిన్ U-13 కప్ సందర్భంగా తూర్పు జావాలోని బోజోంగోరోలో ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న ఆటగాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 20 నిమిషాల పాటు ప్రయత్నించిన వైద్యులు అతడిని స్పృహలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. మైదానంలో ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లు కూడా పిడుగుపాటుకు గురై ఆ తర్వాత ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి