2023 FIFA Womens World Cup: రెండు దేశాలు.. తొమ్మిది నగరాలు.. మహిళల ఫిపా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి..
2023 FIFA Womens World Cup: ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్‌బాల్ మ్యాచ్‌లకు ఉండే క్రేజీయే వేరు. క్రికెట్ కంటే కూడా ఫుట్‌బాల్‌కు..
2023 FIFA Womens World Cup: ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్‌బాల్ మ్యాచ్‌లకు ఉండే క్రేజీయే వేరు. క్రికెట్ కంటే కూడా ఫుట్‌బాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎక్కువ అని చెప్పాలి. ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ జరుగుతుందంటే.. ఆ సందడే వేరు. ప్రపంచంలో ఏ మూలన ఫుట్ బాల్ మ్యాచ్ జరిగిన ఆ స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోతుంది. స్టేడియంకు వెళ్లలేని అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా అతిథ్యమిస్తున్న 2023 ఫిఫా మహిళ వరల్డ్‌కప్‌ను 9 నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 10 స్టేడియాల్లో జరగనుంది. మొత్తం 32 జట్లు పోడీ పడనున్న ఈ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ను ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనుంది. రెండు సెమీ ఫైనల్స్‌ను ఆసీస్, కివీస్‌లో నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌కు సిడ్నీ స్టేడియం వేదిక కానుంది. అయితే, సాధారణంగా ఫిపా వరల్డ్‌కప్ ఎప్పుడైనా ఒకే దేశంలో నిర్వహిస్తారు. కానీ ఇసారి ట్రోఫీని మాత్రం రెండు దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఇలా రెండు దేశాలు ఫిపా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
Also read: