AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్.. ఆసియా క్రీడల్లో భారత్‌కు 12వ పతకం

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చైనాతో జరిగిన సెమీఫైనల్లో 1-3 తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, ఆయుష్ శెట్టి, ఎం.ఆర్. అర్జున్-హరిహరన్ అమసకరుణ్ పోరాడినా ఫైనల్ చేరలేకపోయారు. దీంతో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ పతకంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మొత్తం 12 పతకాలు చేరాయి.

Asian Games 2026: కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్.. ఆసియా క్రీడల్లో భారత్‌కు 12వ పతకం
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 23, 2026 | 7:26 PM

Share

Asian Games 2026:జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అద్భుతమైన పోరాటాన్ని కనబరిచింది. బుధవారం (సెప్టెంబర్ 23) జరిగిన ఉత్కంఠభరితమైన పురుషుల జట్టు సెమీఫైనల్లో భారత్, చైనా జట్టు చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్ స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పతకంతో ఆసియా క్రీడలలో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కి చేరుకుంది. ఈ టోర్నీలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తన ప్రయాణాన్ని ఈ కాంస్యంతో ముగించింది.

సెమీఫైనల్‌కు చేరుకునే ముందు భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన జపాన్ జట్టును ఏకంగా 3-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. అంతకుముందు రౌండ్-5లో కూడా బంగ్లాదేశ్ జట్టును 3-0 తేడాతో మట్టికరిపించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయితే నాకౌట్ దశలో బలమైన చైనాతో తలపడే సమయానికి మ్యాచ్ హోరాహోరీగా మారింది.

చైనాతో జరిగిన ఈ సెమీఫైనల్ పోరులో తొలి మ్యాచ్‌ను భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ప్రారంభించాడు. చైనాకు చెందిన షీ యుకితో తలపడిన లక్ష్య సేన్ హోరాహోరీగా పోరాడినప్పటికీ, చివరకు 16-21, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో చైనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన దేశం గర్వించదగ్గ డబల్స్ జోడి సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరును కనబరిచారు. చైనాకు చెందిన లియాంగ్ వెయికింగ్, వాంగ్ చాంగ్ జోడిని 21-11, 22-20 సెట్ల తేడాతో ఓడించి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో స్కోరు 1-1తో సమం కావడంతో భారత్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి.

మ్యాచ్‌ టై అయిన తర్వాత మూడో సింగిల్స్ మ్యాచ్‌లో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి, చైనా ఆటగాడు లీ షిఫెంగ్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 19-21, 13-21 తేడాతో ఓడిపోవడంతో చైనా మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక నాలుగో మరియు అత్యంత కీలకమైన డిసైడర్ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎం.ఆర్. అర్జున్, హరిహరన్ అమసకరుణ్ జోడి బరిలోకి దిగింది. చైనా జోడితో తీవ్రంగా పోరాడిన మన జంట 21-16, 17-21, 21-9 తేడాతో పరాజయం పాలైంది. దీంతో చైనా జట్టు 3-1 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఫైనల్‌లోకి ప్రవేశించింది. భారత జట్టు పోరాట పటిమను ప్రదర్శించి కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి