AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి? గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Shubman Gill: న్యూజిలాండ్ టూర్‌ లో భాగంగా టెస్ట్ సిరీస్ కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్లకు వన్డేల నుంచి విశ్రాంతి లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరోక్షంగా వెల్లడించారు. 

Shubman Gill: శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి? గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill
Rakesh
|

Updated on: Sep 23, 2026 | 6:27 PM

Share

Shubman Gill: భారత క్రికెట్ జట్టు త్వరలో అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ జట్టు ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. అయితే ఈ భారీ షెడ్యూల్‌కు సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎ ఒక ఆసక్తికరమైన, కీలకమైన ప్రణాళికను వెల్లడించారు. ముఖ్యంగా టెస్ట్ సిరీస్‌కు ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా సన్నద్ధం చేసేందుకు వన్డే సిరీస్‌లో కీలక మార్పులు చేయనున్నట్లు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

వన్డేల చివరి మ్యాచ్‌ల నుంచి శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి?

వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రెడ్ బాల్ క్రికెట్ కోసం బ్యాటర్లను సిద్ధం చేయడం అత్యంత ముఖ్యమని గౌతమ్ గంభీర్‎ అభిప్రాయపడ్డారు. దీనికోసం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లను వన్డే సిరీస్ చివరి దశలో కొన్ని మ్యాచ్‌ల నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వైట్ బాల్ క్రికెట్ నుంచి రెడ్ బాల్ క్రికెట్‌కు మారడానికి తగినంత సమయం దక్కాలనే ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

టెస్ట్ క్రికెట్టే మా అత్యున్నత ప్రాధాన్యత

హాట్‌స్టార్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. బలమైన టెస్ట్ టీం ఉన్న దేశమే క్రికెట్‌లో ఎప్పటికీ అగ్రగామిగా నిలవగలదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఆటగాళ్లకు కూడా టెస్ట్ క్రికెట్ విలువను అర్థమయ్యేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీ20, వన్డేల నుంచి నేరుగా టెస్ట్ మ్యాచ్‌లలో ఆడటం అంత సులభం కానందున, సరైన సన్నాహకాలు ఉండాలని గంభీర్‎ గట్టిగా నమ్ముతున్నారు.

భవిష్యత్తులో ఆటగాళ్ల నిరంతర రొటేషన్

ప్రస్తుత ఆధునిక క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఒకే జట్టుతో కొనసాగడం అసాధ్యమని గంభీర్‎ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. వర్క్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఎప్పటికప్పుడు రొటేట్ చేయడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కివీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కోచ్ గంభీర్‎ వేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..