Watch Video: ఫిఫా ప్రపంచ కప్‌లో అల్లర్లు.. మొరాకో విజయంతో బెల్జియం ఫ్యాన్స్ రచ్చ..

Belgium vs Morocco: ఫిఫా ప్రపంచకప్‌లో ఆదివారం బెల్జియం ఓటమి తర్వాత, బ్రస్సెల్స్, లీజ్, ఆంట్‌వెర్ప్‌లో అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి.

Watch Video: ఫిఫా ప్రపంచ కప్‌లో అల్లర్లు.. మొరాకో విజయంతో బెల్జియం ఫ్యాన్స్ రచ్చ..
Belgium Vs Morocco
Follow us

|

Updated on: Nov 28, 2022 | 4:04 PM

ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022)లో ఆదివారం మరో అపశృతి చోటు చేసుకుంది. మొరాకో 2-0తో బెల్జియంను ఓడించింది. ప్రపంచ నంబర్ 2 ర్యాంక్ జట్టుతో ఈ ఓటమికి బెల్జియం ఫుట్‌బాల్ అభిమానులు ఆశ్చర్యంతో పాటు నిరాశ చెందారు. కాసేపటికే ఈ నిరాశ కలకలం రేపింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ సహా మూడు నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. ఫుట్‌బాల్ అభిమానులు ఇక్కడ అనేక దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. కాల్పుల ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

మొరాకోతో ఓటమి తర్వాత డజన్ల కొద్దీ బెల్జియన్ ఫుట్‌బాల్ అభిమానులు బ్రస్సెల్స్‌లో షాప్ కిటికీలను పగులగొట్టారు. షాపుల్లోకి క్రాకర్స్ కూడా విసిరారు. కొన్ని వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. మ్యాచ్ ముగియకముందే రచ్చ మొదలైనట్లు పోలీసులు చెబుతున్నారు. అల్లరిమూకలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. వీరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని కూడా పోలీసులు తేల్చారు. అల్లర్లతో బ్రస్సెల్స్ పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ గందరగోళం తర్వాత, రాజధానిలో వందలాది మంది పోలీసులను మోహరించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని మెట్రో స్టేషన్లు, వీధులను కూడా కొన్ని గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. బెల్జియంలో మొరాకో మూలానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం వారి సంఖ్య 5 లక్షలకు పైగానే ఉంటుంది. మొరాకో విజయం తర్వాత ఇంతమంది సంబరాలు చేసుకున్న తర్వాతే అల్లర్ల ఘటనలు తెరపైకి వస్తున్నట్లు తేలింది.

లీజ్ నగరంలోని పోలీస్ స్టేషన్‌పై 50 మంది దాడి..

బెల్జియంలోని తూర్పు నగరం లీజ్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాదాపు 50 మంది వ్యక్తుల గుంపు దాడి చేసింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ అద్దాలు పగులగొట్టారు. రెండు పోలీసు వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక్కడ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్‌ను ప్రయోగించారు. ఉత్తర ప్రాంతంలోని ఆంట్‌వెర్ప్‌లో ఇలాంటి గొడవ కారణంగా డజనుకు పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, ఈ మ్యచ్ తర్వాత బెల్జియం తదుపరి మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో బెల్జియం, మొరాకోలు సమ పోరు చూడాల్సి వచ్చింది. సెకండాఫ్‌లో, మొరాకో 73వ, స్టాపేజ్ టైమ్‌లో (90+2′ నిమిషాలు) గోల్ చేసింది. ఈ ఫలితం తర్వాత 16వ రౌండ్‌లో చేరడం బెల్జియంకు కాస్త కష్టంగా మారింది. ప్రస్తుతం చివరి-16కి చేరుకోవడానికి తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాను ఓడించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి