FIFA World Cup 2022: హాట్‌కేకుల్లా టికెట్లు.. ఈ 5 మ్యాచ్‌లపైనే జనాల ఆసక్తి.. ఇప్పటివరకు ఎన్ని సేల్ అయ్యాయంటే?

ఖతార్‌లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు 24.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా ఒక ప్రకటన విడుదల చేసింది.

FIFA World Cup 2022: హాట్‌కేకుల్లా టికెట్లు.. ఈ 5 మ్యాచ్‌లపైనే జనాల ఆసక్తి.. ఇప్పటివరకు ఎన్ని సేల్ అయ్యాయంటే?
Fifa 2022
Follow us
Venkata Chari

|

Updated on: Aug 19, 2022 | 10:00 AM

మధ్యప్రాచ్యంలో జరగనున్న మొదటి ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు 24.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఫిఫా గురువారం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. టిక్కెట్ల విక్రయాల చివరి దశలో (జులై 5 నుంచి 16 వరకు) 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఫిఫా తెలిపింది. ఈ సంవత్సరం ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. FIFA తన ప్రకటనలో, అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన 5 మ్యాచ్‌లను కూడా పేర్కొంది. ఈ మ్యాచ్‌లలో కామెరూన్ vs బ్రెజిల్, బ్రెజిల్ vs సెర్బియా, పోర్చుగల్ vs ఉరుగ్వే, కోస్టారికా vs జర్మనీ, ఆస్ట్రేలియా vs డెన్మార్క్ ఉన్నాయి. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ప్రజలు టిక్కెట్లు కొనడానికి ఆసక్తిని కనబరిచారంట.

ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా, మెక్సికో, ఇంగ్లండ్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌, వేల్స్‌, ఆస్ట్రేలియా నుంచి ఫుట్‌బాల్‌ అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు ఫిఫా తెలిపింది. ఈ దేశాల నుంచే గరిష్ట సంఖ్యలో టిక్కెట్లు బుక్ అయ్యాయని పేర్కొంది.

టికెట్ విక్రయాల తదుపరి దశ ఎప్పుడు?

ఇవి కూడా చదవండి

FIFA వరల్డ్ కప్ 2022 టిక్కెట్ల కోసం మరికొన్ని ప్రకటనలు రావాల్సి ఉంది. ఆ తర్వాత సెల్ దశ సెప్టెంబర్ చివరిలో ప్రకటించనున్నారు. దీని తర్వాత, ‘లాస్ట్ మినిట్ సేల్స్ ఫేజ్’ ప్రారంభంతో పాటు, ‘ఓవర్ ది కౌంటర్ సేల్’ కూడా దోహాలో ప్రారంభించనున్నారు.

తొలి మ్యాచ్ నవంబర్ 20న..

FIFA వరల్డ్ కప్ 2022 మొదటి మ్యాచ్ నవంబర్ 20న ఆతిథ్య దేశం ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ మధ్య జరగనుంది. సాధారణంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు జూన్-జులైలో జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఖతార్‌లో భయంకరమైన వేడి ఉంటుంది. అందుకే నవంబర్‌లో ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు.

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే