Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్.. ఏమన్నాదంటే..!

మను భాకర్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై స్వయంగా మను భాకర్ స్పందించారు. ఖేల్ రత్న అవార్డుకు మను దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. కాగా మను దరఖాస్తు చేసుకున్నప్పటికీ కమిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని మను తండ్రి ఆరోపించారు.

Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్..  ఏమన్నాదంటే..!
Manu Bhaker
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 24, 2024 | 4:58 PM

డిసెంబర్ 23న ఖేల్ రత్న అవార్డు జాబితా విడుదలైంది. అందులో భారత షూటింగ్ స్టార్ మను భాకర్ పేరు లేదు. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఖేల్ రత్న అవార్డుకు మను దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. కాగా మను దరఖాస్తు చేసుకున్నప్పటికీ కమిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని మను తండ్రి ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయంపై మను భాకర్ స్పందించింది. ఖేల్ రత్న అవార్డు జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని ఆమె పేర్కొంది.

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన మను పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేసిన పేర్లలో మీ పేరు లేదు, ఎందుకు?’ అని యాంకర్ అడుగగా, ఈ ప్రశ్నకు మను స్పందిస్తూ, ‘ఈ ప్రశ్న నన్ను కాదు.. అధికారులను అడగాలి. ఖేల్ రత్న చాలా పెద్ద అవార్డు. అది అందుకోవడం నాకు గౌరవంగా ఉంటుందని” ఆమె బదులిచ్చింది.

మీ పేరు ఖేల్ రత్న అవార్డులో లేనందుకు బాధగా అనిపించలేదా, నిరాశగా లేదా?’ అని యాంకర్ అడుగగా.. నేను ఖచ్చితంగా కొంచెం విచారంగా ఉన్నాను, కానీ నా క్రాఫ్ట్‌పై నేను పని చేయాల్సి ఉంది. క్రీడే నా లక్ష్యం. పౌరుడిగా, క్రీడాకారిణిగా వీలైనంత కష్టపడి పతకాలు సాధించడం నా కర్తవ్యం. ఈ ఏడాది నాకు అవార్డు వస్తుందని ఆశించాను కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏది జరిగినా, నేను చాలా సానుకూలంగా ఉన్నాను” మను సమాధానం ఇచ్చింది.

భారత స్టార్ షూటర్ మను భాకర్ 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో 2 కాంస్య పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మను ఘనత సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత మనుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. అయితే దేశంలోనే అతిపెద్ద క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఆమె పేరును చేర్చలేదన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తపై తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జాబితాలో మను పేరు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని క్రిడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ