స్టీవ్ స్మిత్‌కి ఇష్టమైన ఇండియన్ క్రికెటర్ ఎవరంటే…
ప్రస్తుతం కరోనా కాలం. దీంతో మెగా టోర్నీలు అన్నీ రద్దవ్వడంతో క్రీడాకారులంతా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్లేయర్స్ నెటిజన్లతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కాలం. దీంతో మెగా టోర్నీలు అన్నీ రద్దవ్వడంతో క్రీడాకారులంతా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్లేయర్స్ నెటిజన్లతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన టీమిండియా క్రికెటర్ ఎవరో చెప్పాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. యంగ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆటతీరు బాగా నచ్చుతుందని తెలిపాడు. అందుకే అతడి బ్యాటింగ్‌కు తాను ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. తాజాగా జరిగిన ఇన్‌స్టా లైవ్‌లో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఇలా ఆన్సర్ ఇచ్చాడు. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు చెప్పకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ఇండియా జట్టులోని స్టార్ క్రికెటర్లలో రాహుల్‌ను ఒకడని, ప్రజంట్ అతడు మంచి ఫామ్‌లో రాణిస్తున్నాడని స్మిత్ వివరించాడు. కాగా కేఎల్ రాహుల్ ఈ మధ్య ప్రపంచ క్రికెట్ లో తన ముద్ర వేస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న టఫ్ బ్యాట్స్‌మెన్స్ లో రాహుల్ ఒకడని చెప్పాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాజ్కు సారథిగా ఉన్న రాహుల్.. 2019 సీజన్లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్స్ లో సెకండ్ ప్లేసులో నిలిచాడు.




