Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. వరుసగా రెండో సారి స్వర్ణ పతకం.. భారత్ ఖాతాలో మూడో గోల్డ్ మెడల్..

|

Mar 26, 2023 | 7:06 PM

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. 50కిలోల బాక్సింగ్‌ విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించింది. ఇందుకోసం ఆమె..

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. వరుసగా రెండో సారి స్వర్ణ పతకం.. భారత్ ఖాతాలో మూడో గోల్డ్ మెడల్..
Nikhat Zareen
Follow us on

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. సీనియర్ బాక్సింగ్‌(48-50 కేజీలు) విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతాకం సాధించింది. అంతేకాక సీనియర్ విభాగంలో భారత మాజీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. ఇందుకోసం ఆమె ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 5-0 తేడాతో వియత్నాం బాక్సర్‌ న్యూయెన్ టి తామ్‌పై విజయం సాధించింది.

కాగా, శనివారం జరిగిన ఫైనల్స్‌లో కూడా భారత్‌ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్‌ 5-0 తేడాతో లుత్సాయి ఖాన్‌ (మంగోలియా)ను నెల కరిపించగా.. 81 కేజీల విభాగం టైటిల్‌ పోరులో స్వీటీ బూర 4-3 తేడాతో వాంగ్‌ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది. దీంతో ఈ ఏడాది భారత్ ఖాతాలో 3 బాక్సింగ్ గోల్డ్ మెడల్స్ చేరాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..