Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం..! భారత సైన్యంలో..

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాకు భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇండియా గెజిట్ ద్వారా ఈ ప్రకటన జరిగింది. 2025 ఏప్రిల్ 16 నుంచి ఈ హోదా అమల్లోకి వస్తుంది. నీరజ్ 2016లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా చేరి, వివిధ పదోన్నతులను పొందారు.

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం..! భారత సైన్యంలో..
Neeraj Chopra

Updated on: May 14, 2025 | 7:07 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేస్తూ ఇండియన్‌ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. ఇండియా గెజిట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది.

“1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్‌లోని పేరా 31 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని 2025 ఏప్రిల్ 16 నుండి అమలులోకి వచ్చేలా హర్యానాలోని పానిపట్‌లోని PVSM, పద్మశ్రీ, VSM, విలేజ్ అండ్‌ పోస్ట్ ఆఫీస్ ఖంద్రాకు నీరజ్‌ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకును ప్రదానం చేయడానికి అధ్యక్షుడు సంతోషంగా ఉన్నారు” అని ప్రకటన పేర్కొంది. నీరజ్ 2016లో నయీబ్ సుబేదార్ హోదాతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైన్యంలో చేరారు. 2021లో సుబేదార్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సుబేదార్ నుంచి మేజర్ హోదాకు కూడా పదోన్నతి పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..