AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ప్లేఆఫ్స్‌లో బీసీసీఐ ఊహించని మార్పు.. ఢిల్లీకి లాభం, ముంబైకి నష్టం.. అదేంటంటే?

IPL 2025 Playoffs: తాజా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 లీగ్ దశ మ్యాచ్‌లు మే 27 వరకు జరుగుతాయి. మొదటి క్వాలిఫైయర్ మే 29న, ఎలిమినేటర్ మే 30న, రెండవ క్వాలిఫైయర్ జూన్ 1న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. వేదిక ఎక్కడ అనేది ఇంకా వెల్లడించలేదు. ఫైనల్ మ్యాచ్ జరిగే వేదికపై ఉత్కంఠ కొనసాగుతుంది.

IPL 2025: ప్లేఆఫ్స్‌లో బీసీసీఐ ఊహించని మార్పు.. ఢిల్లీకి లాభం, ముంబైకి నష్టం.. అదేంటంటే?
Ipl 2025
Venkata Chari
|

Updated on: May 14, 2025 | 1:55 PM

Share

IPL 2025 Playoffs: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత IPL 2025 మళ్ళీ ప్రారంభం కానుంది. మే 12న ప్లేఆఫ్‌లతో సహా 17 మ్యాచ్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లు బెంగళూరు, లక్నో, జైపూర్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లలో జరుగుతాయని బోర్డు తెలియజేసింది. కానీ ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల వేదిక గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం, అహ్మదాబాద్ ఫైనల్‌కు షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ప్లేఆఫ్‌లను ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహించాలనుకుంది. కానీ, ఇప్పుడు ఈ జాబితాలో ఢిల్లీ పేరును కూడా చేర్చారు. బీసీసీఐ ఢిల్లీని ఎంచుకుంటే ముంబై నష్టపోతుంది.

ఎవరికి అవకాశం లభిస్తుంది?

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముంబైలోని వాంఖడే స్టేడియం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ముందంజలో ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ముంబైకి కనీసం ఒక ప్లేఆఫ్ మ్యాచ్ అయినా దక్కుతుందని భావిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇప్పుడు ఢిల్లీ కూడా ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రేసులో చేరింది. ఇదే జరిగితే ముంబై నష్టపోతుంది. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆదాయం పెరగవచ్చు. అది ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే, హోం గ్రౌండ్‌లో ఆడే ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటికే అరుణ్ జైట్లీ స్టేడియంలో 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. మిగిలిన 13 గ్రూప్ దశ మ్యాచ్‌లలో, 3 మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగుతాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే సొంత మ్యాచ్‌తో పాటు, ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 3న కోల్‌కతాలో భారీ వర్షం పడుతుందనే హెచ్చరిక కారణంగా, ఫైనల్ మ్యాచ్‌ను అక్కడికి మార్చారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయి?

తాజా షెడ్యూల్ ప్రకారం, IPL 2025 లీగ్ దశ మ్యాచ్‌లు మే 27 వరకు జరుగుతాయి. క్వాలిఫైయర్-1 మే 29న, ఎలిమినేటర్ మే 30న, క్వాలిఫైయర్-2 జూన్ 1న జరుగుతాయి. చివరి మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫోన్‌లో రాత్రి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త!
ఫోన్‌లో రాత్రి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త!
అబుదాబిలో BAPS హిందూ మందిర్ నిస్వార్థ సేవ..
అబుదాబిలో BAPS హిందూ మందిర్ నిస్వార్థ సేవ..
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.20 వేలు తగ్గింపు.. 123 కి.మీ రేంజ్‌..
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.20 వేలు తగ్గింపు.. 123 కి.మీ రేంజ్‌..
రంజాన్ స్పెషల్ : పొట్టేల్ తలకాయ కూర.. ఇలా వండితే అదిరిపోతుంది!
రంజాన్ స్పెషల్ : పొట్టేల్ తలకాయ కూర.. ఇలా వండితే అదిరిపోతుంది!
'ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ ఓపెనర్లు వీళ్లే..'
'ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ ఓపెనర్లు వీళ్లే..'
'గజినీ'సినిమాలో కనిపించే ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయినా?
'గజినీ'సినిమాలో కనిపించే ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయినా?
ఇరాన్ సెక్యూరిటీ సుప్రీం అలీ లారిజానీ చనిపోయారా..?
ఇరాన్ సెక్యూరిటీ సుప్రీం అలీ లారిజానీ చనిపోయారా..?
ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల తేదీలు ఇవే
ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల తేదీలు ఇవే
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు..
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు..
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు..
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు..