క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే జాతీయ క్రీడా అవార్డులను బుధవారం (డిసెంబర్ 20) కేంద్రం ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుతో సత్కరించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. షమీతో పాటు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డు ఇవ్వనున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ సహా వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన ఆటగాళ్లు కూడా జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు. వీరే కాకుండా వివిధ క్రీడలకు చెందిన 5 మంది కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ముగ్గురు అనుభవజ్ఞులకు ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలందరికీ 2024న 9 జనవరి రాష్ట్రపతి భవన్‌లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్).
ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం:
Huge congratulations to @hardiksingh008 on winning the 2023 FIH Player of the Year (Male) Award!
With his precise passes and ability to orchestrate attacks, he not only sets the turf ablaze but inspires a generation of upcoming hockey stars with his grit and determination.… pic.twitter.com/71FD7B1OB8
— Anurag Thakur (@ianuragthakur) December 20, 2023
Government announces #NationalSportsAwards 2023
Badminton players Chirag Shetty and Satwiksairaj Rankireddy to be honoured with Major Dhyan Chand Khel Ratna Award. pic.twitter.com/WY4liMD0y7
— All India Radio News (@airnewsalerts) December 20, 2023
ASIAN GAMES GOLD MEDALISTS 🏆
To all who cheered, believed, and stood by me – this gold is as much yours as it is ours. Holding this gold, I feel the weight of your love and support more than ever. This victory belongs to all of us. Thank you Jai Hind 🇮🇳 pic.twitter.com/GSouLRYgXM— Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) October 10, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..