నెక్ట్స్ రెండు వన్డేలకు ధోనీకి రెస్ట్

రాంచీ: ఆస్ట్రేలియాతో జరగనున్న మిగతా రెండు వన్డేల నుంచి టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచులు జరగ్గా.. అందులో మొదటి రెండింటిలో భారత్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడింది. పంజాబ్‌లోని మొహాలీలో ఆదివారం నాలుగో వన్డే జరగనుంది. మార్చి 13న దిల్లీలో ఐదో వన్డే జరగనుంది. చివరి రెండు వన్డేల నుంచి ధోనీకి విశ్రాంతినిచ్చారు. టీమిండియా సహాయక కోచ్‌ […]

నెక్ట్స్ రెండు వన్డేలకు ధోనీకి రెస్ట్
Follow us

|

Updated on: Mar 09, 2019 | 2:32 PM

రాంచీ: ఆస్ట్రేలియాతో జరగనున్న మిగతా రెండు వన్డేల నుంచి టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచులు జరగ్గా.. అందులో మొదటి రెండింటిలో భారత్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడింది. పంజాబ్‌లోని మొహాలీలో ఆదివారం నాలుగో వన్డే జరగనుంది. మార్చి 13న దిల్లీలో ఐదో వన్డే జరగనుంది. చివరి రెండు వన్డేల నుంచి ధోనీకి విశ్రాంతినిచ్చారు. టీమిండియా సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… ‘చివరి రెండు వన్డేల్లో పలు మార్పులు చేయనున్నాం. ఈ రెండు మ్యాచుల్లో ధోనీ ఆడడు. ఆయనకు విశ్రాంతి ఇస్తున్నాం’ అని తెలిపారు.

ధోనీ స్థానంలో రిషబ్‌ పంత్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. మొదటి మూడు వన్డేల్లో ఆడే అవకాశం అతడిని రాలేదు. మరోవైపు కాలికి గాయం కారణంగా మిగతా రెండు వన్డేల్లో పేసర్‌ షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ‘మిగతా వన్డేల్లో ఆడడానికి షమీ ఫిట్‌గా ఉన్నాడో.. లేదో తెలుసుకోవాల్సి ఉంది. అతడు ఫిట్‌గా లేకపోతే భువనేశ్వర్‌‌ను ఆడిస్తాం. ఆటకు ముందు టీమిండియా కోచ్‌, కెప్టెన్‌.. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని సంజయ్‌ బంగర్‌ వెల్లడించారు.