ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ఇదే.. జట్టులో షమీ రీ-ఎంట్రీ
India vs England T20 Series: ఇంగ్లండ్ జట్టుతో ఈ నెల 22 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టులో ఫేసర్ మహ్మద్ షమీకి చోటు కల్పించింది. బుమ్రా, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌కు విశ్రాంతి కల్పించింది.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఫేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22 నుంచి జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 2023 నవంబర్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కుడి కాలు మడమకు గాయం కారణంగా షమి జట్టుకు దూరమయ్యాడు. 14 మాసాల విరామం తర్వాత ఇప్పుడు షమి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్‌కు కూడా జట్టులో చోటు కల్పించారు.
భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ సారథ్యంవహించనున్నాడు. అక్సర్ పటేట్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ముందుగా ఊహించినట్లుగానే స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌కు విశ్రాంతి కల్పించారు. అలాగే రిషభ్ పంత్, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌కు కూడా విశ్రాంతి కల్పించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలో ముంబైలోని స్టార్ హోటల్లో జరిగిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంగ్లండ్ – భారత్ మధ్య టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్ మైదానంలో జనవరి 22న జరగనుంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ పూర్తయిన తర్వాత భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన వారంలోజుల్లోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
టీమిండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).
A look at the Suryakumar Yadav-led squad for the T20I series against England 🙌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nrEs1uWRos
— BCCI (@BCCI) January 11, 2025
మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి