
ప్రస్తుతం ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ (MI)vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను చూసేందుకు చాలా మంది సినీప్రముఖులు, సెలబ్రేటీలు వచ్చారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాలన్నీ ఓ అమ్మాయి వైపు తిరిగాయి. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ, రవీనా టాండన్ కూతురు రషాతోపాటు పలువురు సెలబ్రెటీలు వచ్చారు. కానీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్ లో నిలబడి ఉన్న ఆ అమ్మాయి వైపు కెమెరాలు తరచూ తిరుగుతూ కనిపించాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసిన ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది. చాలా కాలం గ్యా్ప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
అవును.. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి..బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్. 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతంగా ఆఫర్స్ రాలేదు. దీంతో స్పెషల్ పాటలతో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. హిందీలో వచ్చిన జన్నత్ సినిమాతో ఈ బ్యూటీకి నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటి వచ్చింది. అలాగే తెలుగులో వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రంలోనూ మెరిసింది.
ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన సోనాల్ చౌహన్..ఇప్పుడు వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై, హైదరాబాద్ మ్యాచ్ చూసేందుకు వచ్చింది. స్టేడియం స్టాండ్లలో నిలబడి ఉన్న ఆమెను చాలా మంది గుర్తించలేరు. ఒకప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న సోనాల్ చౌహన్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తెలుగులో లెజెండ్, పండగ చేస్కో, రూలర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యా్చ్ లో అద్భుతమైన ప్రదర్శనతో SRHను ఓడించింది ముంబై ఇండియన్స్.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..