రెహమాన్‌ పాటకు కెవిన్‌ పీటర్సన్ టిక్‌టాక్‌.. వీడియో షేర్ చేసిన సంగీత దిగ్గజం..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే మొన్నటివరకు తమ తమ రంగాల్లో బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది కాబోలు అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు టిక్‌టాక్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:08 pm, Tue, 12 May 20
రెహమాన్‌ పాటకు కెవిన్‌ పీటర్సన్ టిక్‌టాక్‌.. వీడియో షేర్ చేసిన సంగీత దిగ్గజం..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే మొన్నటివరకు తమ తమ రంగాల్లో బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది కాబోలు అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు టిక్‌టాక్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ టిక్‌టాక్‌ల్లో బిజీ అయ్యారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించిన జంటిల్‌మ్యాన్ చిత్రంలోని ఒట్టగత్తి కట్టికో అనే పాటకు ఇటీవల పీటర్సన్ టిక్‌టాక్‌ చేశారు. అందులో మొదట స్టెప్‌లు వేసేందుకు పీటర్సన్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తరువాత అదరగొట్టేశాడు. ఈ టిక్‌టాక్‌ అందరినీ ఆకట్టుకుంటుండగా.. దీనికి సంబంధించిన వీడియోను రెహమాన్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఇక టిక్‌టాక్‌లతో పాటు గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాలో పలు దేశాలకు చెందిన క్రికెటర్లతో ఆయన లైవ్‌ సెషన్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Read This Story Also: పవన్‌తో రొమాన్స్‌ చేయబోయేది ఈ బ్యూటీనా.. వావ్..! ఎంత అందంగా ఉందో..!

https://www.instagram.com/p/CADeYv1g5CT/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again