ఐపీఎల్ రద్దయితే.. బీసీసీఐకి వచ్చే నష్టం ఎంతంటే..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం ఇండియన్

ఐపీఎల్ రద్దయితే.. బీసీసీఐకి వచ్చే నష్టం ఎంతంటే..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 4:57 PM

IPL: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగకపోతే.. బీసీసీఐకి వచ్చే నష్టం అక్షరాల 500 మిలియన్ డాలర్లు అని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ వాయిదాపడిన విషయం విదితమే.

కాగా.. తొలుత లీగ్‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. కానీ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించడంతో.. లీగ్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఒకవేళ ఐపీఎల్ ఈ ఏడాది జరగకపోతే.. రూ.40 బిలియన్‌ల(530 మిలియన్ డాలర్లు) నష్టం వస్తుంది. అంతకన్నా.. ఎక్కువే రావొచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకం మాకూ లేదు. ఎన్ని మ్యాచ్‌లు వాయిదా పడ్డాయో అనే స్పష్టత వస్తే కానీ.. నష్టం ఎంత వచ్చిందనే విషయాన్ని అంచనా వేయలేము’’ అని అరుణ్ పేర్కొన్నారు.

మరోవైపు.. గత ఏడాది ఐపీఎల్ నికర లాభం 6.7 బిలయన్ డాలర్లు అని డఫ్ అండ్ ఫెలెప్స్ ఫినాన్షియల్ కన్సల్టెన్సి అంచనా వేసింది. అంతేకాక.. ఐదు సంవత్సరాల వరకూ ఐపీఎల్ ప్రసారం కాంట్రాక్ట్‌ను స్టార్ స్పోర్ట్స్ 220 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 16న అండమాన్‌కి నైరుతి రుతుపవనాలు…