
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. వీరి హక్కులకు భద్రత కల్పిస్తూ న్యాయస్థానాలు పలు తీర్పులను వెలువరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ట్రాన్స్ జండర్లు వృత్తి వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. మన్న బాంబేలో ఒక ప్రత్యేక సెలూన్ ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వారు కొందరైతే.. పలువురికి వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ గా పేరొందిన వాళ్లు మరికొందరు. తాజాగా ట్రాన్స్ జెండర్లను వివాహం చేసుకున్న పురుషులు కూడా చాలా మంది వెలుగులోకి వచ్చారు. అయితే గతంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న ట్రాన్స్ జెండర్లకు క్రికెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం.
డేనియల్ మెక్‌గాహే అంతర్జాతీయ క్రికెటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కెనడా తరఫున ఆరు వరల్డ్ టీ 20 మ్యాచులు అడారు. అయితే సెప్టెంబర్ లో ట్రాన్స్ జెండర్ గా మారి తొలి ట్రాన్స్ జండర్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. క్రికెట్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. 2020 సంవత్సరంలో మెక్ గాహే ఆస్ట్రేలియా తరఫున పురుషుల విభాగంలో ఆడారు. ఆ తరువాత 2021లో ట్రాన్స్ జెండర్ గా మారి కెనడా మహిళల జట్టులో చేరారు. ఇలా ట్రాన్స్ జెండర్ గా మారిని డేనియల్ ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ లో పాల్గొన్నారు. అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్ లో కెనడా తరఫున ఆరు వరల్డ్ టీ 20 మ్యాచ్ లను అడారు. 29 ఏళ్ల వయసు కలిగిన మెక్ గేయ్ బ్రెజిల్ మహిళలపై 118 పరుగుల అత్యధిక స్కోరు చేసి 19.66 సగటుతో నిలిచారు.
ఇప్పటి వరకూ చెప్పుకున్నది బాగానే ఉంది. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ద్వారా డేనియల్ మహిళల జట్టులో ఆటగాడిగా కొనసాగలేరు. ఐసీసీ నవంబర్ 21న మహిళా క్రికెట్ జట్టులో పాల్గొనేందుకు ట్రాన్స్ జెండర్ క్రికెటర్లకు అనుమతిని నిషేధించింది. గత తొమ్మిది నెలలుగా కొంతమంది క్రికెట్ దిగ్గజాలను కలిసి వారితో సంప్రదింపులు జరిపి అపెక్స్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం మగ నుంచి ఆడగా మారిన ఏ క్రికెటర్ అయినా, లింగ సంబంధిత ఎలాంటి శాస్త్ర చికిత్స చేసుకున్నా మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు అర్హత ఉండని తెలిపింది. మహిళల రక్షణ, భద్రత, సఖ్యత, కలివిడిగా ఉండటం వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..