ధోని రికార్డును కొల్లగొట్టిన కోహ్లీ..
భారత క్రికెట్ సారథుల్లో ధోని, కోహ్లీలు..జట్టుకు మరిచిపోలేని విజయాలు అందించారు. ఇద్దరి ఎత్తులు కూడా సెపరేట్‌గా ఉంటాయి. ధోని..కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకోగా, కోహ్లీ..అగ్రెసివ్ సారథిగా సత్తా చాటుతున్నాడు. వీరిద్దరూ కూడా ప్రత్యర్థులకు తమ గేమ్ ప్లాన్స్‌తో చెమటలు పట్టించినవారే. అయితే కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతూ.. ధోని రికార్డులపై కన్నేశాడు. వాటిని వన్ బై వన్ కంప్లీట్ చేస్తూ..ముందుకు వెళ్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు విక్టరీతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను కొల్లగొట్టాడు. టెస్టుల్లో […]
భారత క్రికెట్ సారథుల్లో ధోని, కోహ్లీలు..జట్టుకు మరిచిపోలేని విజయాలు అందించారు. ఇద్దరి ఎత్తులు కూడా సెపరేట్‌గా ఉంటాయి. ధోని..కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకోగా, కోహ్లీ..అగ్రెసివ్ సారథిగా సత్తా చాటుతున్నాడు. వీరిద్దరూ కూడా ప్రత్యర్థులకు తమ గేమ్ ప్లాన్స్‌తో చెమటలు పట్టించినవారే. అయితే కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతూ.. ధోని రికార్డులపై కన్నేశాడు. వాటిని వన్ బై వన్ కంప్లీట్ చేస్తూ..ముందుకు వెళ్తున్నాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు విక్టరీతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను కొల్లగొట్టాడు. టెస్టుల్లో అత్యథిక ఇన్సింగ్స్ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా..కోహ్లీ అవతరించాడు. ఈ కేటగిరీలో ధోని ఖాతాలో 9 విజయాాలు ఉండగా..బంగ్లాదేశ్‌పై తాజా విక్టరీతో కోహ్లీ 10 విజయాలతో విజయానందంలో ఉన్నాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టెస్ట్ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా(32)..ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్ బోర్డర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ముందంజలో ఉన్నాడు
1. గ్రేమ్ స్మిత్ ((53), 2. రికీ పాంటింగ్ (48), 3. స్టీవ్ వా(41), 4. అలెన్ బోర్డర్ (32), 5. విరాట్ కోహ్లీ (32)