India Vs Australia 2020: ఆసీస్ హీరోలకు బంపర్ ఆఫర్.. అదరగొట్టిన ఆనంద్ మహేంద్రా.. ఎంతోమందికి ఆదర్శం..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన టీమిండియా యువ క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ రూ. 5 కోట్ల...

India Vs Australia 2020: ఆసీస్ హీరోలకు బంపర్ ఆఫర్.. అదరగొట్టిన ఆనంద్ మహేంద్రా.. ఎంతోమందికి ఆదర్శం..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 23, 2021 | 6:14 PM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన టీమిండియా యువ క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా ప్రకటించగా.. తాజాగా మహేంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర క్రికెటర్లకు ఊహించని బహుమతిని ప్రకటించారు. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆరుగురు యువ క్రికెటర్లకు SUV వాహనాలు అందిస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆనంద్ మహేంద్రా ట్వీట్ చేశారు.

తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కుని.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఈస్థాయికి చేరుకున్న ఆరుగురు ప్లేయర్స్ మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవ్‌దీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌లకు థార్‌ SUV కార్లను బహుమతిగా ఇస్తానని ఆయన పేర్కొన్నారు. వీరందరూ కూడా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారని.. ఎంతోమంది భారతీయులకు వీరు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్రా ప్రశంసించారు.