Naina Jaiswal: టెబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌కు వేధింపులు.. యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..

|

Aug 14, 2022 | 12:49 PM

గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నైనా జైస్వాల్‌పై అసభ్యకర కామెంట్లు పెడుతూ శ్రీకాంత్‌ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు.. ఇలాంటి కామెంట్లు పెట్టడంతో.. నైనా ఫిర్యాదు మేరకు సదరు యువకుడిని సిద్దిపేట పోలీసులు

Naina Jaiswal: టెబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌కు వేధింపులు.. యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..
Naina Jaiswal
Follow us on

Table tennis player Naina Jaiswal: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్‌ అనే యువకుడిని శనివారం అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  వెల్లడించారు. గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నైనా జైస్వాల్‌పై అసభ్యకర కామెంట్లు పెడుతూ శ్రీకాంత్‌ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు.. ఇలాంటి కామెంట్లు పెట్టడంతో.. నైనా ఫిర్యాదు మేరకు సదరు యువకుడిని సిద్దిపేట పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్‌ సైతం ఇచ్చారు. అయినా శ్రీకాంత్‌ తీరులో మార్పురాలేదు. ఇటీవల నైనా జైస్వాల్‌ పై ఇన్‌స్టాలో మరోసారి అసభ్యకర సందేశాలు పెట్టాడు. దీంతో నైనా జైస్వాల్‌, ఆమె తండ్రి అశ్వినీ జైస్వాల్‌ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా.. హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్.. టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్‌లలో ఒకరిగా రాణిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నైనా జైస్వాల్.. పలు టైటిళ్లను సైతం గెలుచుకుని అంతర్జాతీయ క్రీడాకారిణిగా పేరును సంపాదించుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి