AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుడ్డోడే కానీ.. మామూలోడు కాదు.. ఏకంగా భారీ ఫైథాన్‌ను ఏం చేశాడంటే..? షాకింగ్ వీడియో

సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయంతో వణికిపోతుంటారు. ఇక దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Viral Video: బుడ్డోడే కానీ.. మామూలోడు కాదు.. ఏకంగా భారీ ఫైథాన్‌ను ఏం చేశాడంటే..? షాకింగ్ వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Aug 14, 2022 | 12:18 PM

Share

Child play with python Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ బుడ్డోడు పామును పట్టుకొని ఆడుకుంటున్న వీడియో నెట్టింట షేక్ చేస్తోంది. దీన్ని చూసి అందరూ భయపడుతున్నారు.. కానీ ఆ బుడ్డోడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు.. సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయంతో వణికిపోతుంటారు. ఇక దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం పాములతోనే ఆడుకుంటుంటారు. ఎలాంటి పామైనా సరే.. పట్టుకుంటుంటారు. ఇకొంతమంది పాములను ఇళ్లల్లోనే పెంచుకుంటుంటారు. ఇవి వారిని ఏం చేయనప్పటికీ.. వాటితో ఎప్పుడూ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసి అందరూ భయపడుతున్నారు. ఓ బాలుడు భారీ ఫైథాన్ తో ఆడుకుంటున్నాడు.

వైరల్ వీడియోలో బుడ్డోడు పాము తోకను పట్టుకుని ఉండటాన్ని చూడవచ్చు. పాము తోకను పుట్టుకున్న బుడ్డోడు మెడలో వేసుకొని ఉండగా.. అది మాత్రం నేలపై పాకుతూ కనిపిస్తుంది. అయితే వీడియో ఎండ్ అయ్యే సమయానికి బుడ్డుడో పెద్దగా అరుస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసి ధైర్యవంతులే షాక్ అవుతున్నారు. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒకసారి చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియో..

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో world_of_snakes_ అయే పేజీ షేర్‌ చేసింది. దీనిని లక్షలాది మంది వీక్షించడంతోపాటు లైకులు చేశారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. బుడ్డోడు మామూలోడు కాదంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..