Hardik Pandya: పాండ్యా కోసం ఏకంగా 2,400 కిమీ నడిచిన అభిమాని.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన టీమిండియా స్టార్
Hardik Pandya: హార్దిక్ పాండ్యాను కలవాలనే కోరికతో లక్నోకు చెందిన రవి కుమార్ రావత్ దాదాపు 2,390 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు. ముంబైకి చేరాక హార్దిక్ బెంగళూరులో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. చివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన అభిమాన క్రికెటర్‌ను కలిశాడు. రవి పట్టుదలను మెచ్చుకున్న హార్దిక్, అతడి తిరుగు ప్రయాణానికి టికెట్లు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hardik Pandya: సాధారణంగా తమ అభిమాన క్రికెటర్లను కలవాలని చాలామంది కోరుకుంటారు. ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడతారు. కానీ అభిమానానికి హద్దులు ఉండవని నిరూపించాడు లక్నోకు చెందిన రవి కుమార్ రావత్. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఒక్కసారి డైరెక్టుగా కలవాలనే కోరికతో దాదాపు 2,390 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు.అతడి ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరానికి చెందిన రవి అనే అభిమాని, హార్దిక్ పాండ్యాను వ్యక్తిగతంగా కలవాలనే బలమైన కోరికతో ఏకంగా 2,400 కిలోమీటర్ల దూరం కాలి నడకన ప్రయాణించాడు. ఈ సాహసం చూసి ఆల్ రౌండర్ పాండ్యాతో పాటు క్రీడా ప్రపంచం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.
లక్నో నుంచి ముంబై.. అక్కడి నుంచి బెంగళూరు వరకు
హార్దిక్ పాండ్యాను కలవడానికి రవి ముందుగా లక్నో నుంచి ముంబై నగరానికి సుమారు 1,400 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. అయితే ముంబై చేరుకున్న తర్వాత పాండ్యా అక్కడ లేరని, రీహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నారని రవి తెలుసుకున్నాడు. ఏమాత్రం అధైర్యపడకుండా ముంబై నుంచి బెంగళూరు వరకు మరో 990 కిలోమీటర్ల దూరం కాలి నడకనే ప్రయాణించి మొత్తం 2,400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నాడు.
A fan walked all the way from Mumbai to Bengaluru just to meet Hardik Pandya, and Hardik not only met him warmly but also arranged his return ticket @hardikpandya7 ❤️ https://t.co/cx62NNHpaE
— Rohan Gangta (@rohangangta) October 19, 2026
పాండ్యాతో ఆత్మీయ కలయిక
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్దకు చేరుకున్న రవి చేతిలో ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డాడు. విషయం తెలుసుకున్న హార్దిక్ పాండ్యా బయటకు వచ్చి ఆ అభిమానిని ఆప్యాయంగా పలకరించాడు. రవితో కాసేపు మాట్లాడి అతనికి ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. “నీకు ఇంకేమైనా కావాలా? నీ కోసం నేను ఏమైనా చేయగలనా?” అని పాండ్యా ఎంతో ప్రేమగా అడిగాడు. ఆ తర్వాత రవి సురక్షితంగా తన సొంత ఊరు చేరుకోవడానికి రిటర్న్ ట్రైన్ టికెట్ కూడా స్వయంగా బుక్ చేసి ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా ఉదారత
హార్దిక్ పాండ్యా చూపించిన ఈ గొప్ప మనసు, ఆప్యాయతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా, బెంగళూరులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తెలుపు బంతి క్రికెట్లో భారత జట్టుకు ఎంతో కీలకమైన ఈ స్టార్ ఆల్ రౌండర్, అభిమాని పట్ల చూపించిన గౌరవం అలాగే ఉదారత క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
