AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన రీసెంట్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ టాప్ ట్రెండింగ్.. తెలుగులో కూడా ఉంది

సాధారణంగా ముఖ్యమంత్రులు నిత్యం బిజి బిజీగా ఉంటారు. సినిమాలు చూసే తీరిక కానీ టైమ్ కానీ అసలు ఉండదు. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్ ఒక సినిమాను ప్రత్యేకంగా చూశారు. అంతేకాదు..చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానంటూ సోషల్ మీడియా వేదికగా ఆ మూవీపై ప్రశంసలు కురిపించారు.

Cinema: ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన రీసెంట్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ టాప్ ట్రెండింగ్.. తెలుగులో కూడా ఉంది
Kerala CM VD Satheesan
Basha Shek
|

Updated on: Oct 21, 2026 | 10:25 AM

Share

మమిత బైజు రీసెంట్ టైంలో చేసిన మలయాళ సినిమా ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా దీన్ని తీశారు. నివిన్ పౌలీ హీరో కాగా ‘ప్రేమలు’ తీసిన గిరీష్ దర్శకుడు. అటు థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఆపై ఓటీటీలోనూ ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని చూసిన కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్.. తనకు ఇది తెగ నచ్చేసిందని చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు. ‘ఇంతకు ముందు ప్రతి నెలా కనీసం ఒక సినిమా అయినా చూసేవాడిని. కానీ ఈ పనుల వల్ల అలవాటు కొన్నాళ్లుగా తప్పింది. నిన్న చాలా రోజుల తర్వాత ఓ మంచి మూవీ చూశాను. ఒకేసారి నా కూతురు, ఆమె స్నేహితురాలితో కలిసి ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ చూడటం ఎంతో సరదాగా అనిపించింది. ఎక్కడా కొంచెం కూడా అసభ్యత కనిపించలేదు. మూవీ చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఇన్నాళ్లు ఈ చిత్రం ఎందుకు చూడలేదా అనిపించింది. కేవలం హీరో, హీరోయిన్ అని చెప్పుకునే ప్రధాన పాత్రలే కాదు, ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించే పాత్రలు కూడా తమదైన ముద్ర వేశాయి. సినిమా చూసి మనసారా నవ్వుకున్నాను. కొన్ని సందర్భాల్లో బాధగానూ అనిపించింది. చివరకు ఎంతో అద్భుతమైన అనుభూతి పొందాను. సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా ప్రశంసిస్తూ నోట్ రాయడం నాకు అలవాటు లేదు. కానీ ఇది చూసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపించింది. అందుకే నా అనుభూతి పంచుకోవాలని నిర్ణయించుకున్నాను’

‘దర్శకుడు ఏ.డి.గిరీష్‌, నటుడు సంగీత్ ప్రతాప్‌కు ఫోన్ చేసి అభినందనించాను. నివిన్ పౌలీ, మమితా బైజూలని ఫోన్‌లో సంప్రదించలేకపోయా. వీరితో పాటు గ్లిక్సన్ కూడా నా మనసులో నిలిచిపోయాడు. పాపం గ్లిక్సన్. బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమాను ఇంత ఆహ్లాదకరంగా, గుర్తుండిపోయే అనుభూతిగా మలిచిన తెర ముందు, తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’ అని విషెస్ చెప్పారు ముఖ్యమంత్రి వీడీ సతీశన్.

ఇవి కూడా చదవండి

కేరళ ముఖ్యమంత్రి షేర్ చేసిన పోస్ట్..

కేరళ ముఖ్యమంత్రి ఒక సినిమా చూడడం, అందులోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us