AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఆ కార్పొరేషన్‌లో పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేపథ్యంలో విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి 29వ తేదీకి మార్చింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండటంతో కూటమి నేతలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఆ కార్పొరేషన్‌లో పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఏంటంటే..
Ap Municipal Elections 2026
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2026 | 9:35 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఎన్నికల తేదీలో మార్పు చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా SEC తేదీని మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 28న జరగాలి.. కానీ పండుగ సందర్భంగా 29కి మార్చాల్సిందిగా కలెక్టర్‌ కోరడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల బందోబస్తు, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని మార్చాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ఎస్‌ఈసీ.. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్ 28 నుండి అక్టోబర్ 29వ తేదీకి మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ తేదీ మారినప్పటికీ, కౌంటింగ్ (ఓట్ల లెక్కింపు) తేదీలో ఎటువంటి మార్పు ఉండదని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో నేటితో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు కూటమి నేతలు రంగంలోకి దిగారు. రెబల్స్‌తో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయ కమిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఇప్పటికే.. ఆయా పార్టీలు హెచ్చరించాయి..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

కాగా.. నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.. నవంబర్ 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 4న అవసరమైతే రీపోలింగ్.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. 28 జిల్లా పరిషత్‌లు, 659 మండల పరిషత్‌ల పరిధిలో ఎన్నికలను నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us