AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చం దుకాణంలో లాగే క్రిస్పీ పప్పు చెక్కలు.. ఇంట్లోనే ఇలా చేయండి!

తెలుగు వంటకాలలో పప్పు చెక్కలు రుచికరమైన, ప్రముఖమైన స్నాక్. వీటిని కొన్ని ఏరియాల్లో చెక్క గారెలు అని కూడా పిలుస్తారు. ఈ రెసిపీ 1 కేజీ బియ్యప్పిండితో తయారుచేసే కరకరలాడే చెక్కలను, నూనె అస్సలు పీల్చకుండా, చాలా క్రిస్పీగా, రుచికరంగా ఎలా చేయాలో ఖచ్చితమైన కొలతలతో ఇక్కడ చూద్దాం.. పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతికి ఇది తప్పకుండా చేసుకోవాల్సిన వంటకం.

Prasanna Yadla
|

Updated on: Oct 21, 2026 | 10:22 AM

Share

కావాల్సిన పదార్థాలు:  బియ్యప్పిండి (పొడిది): 1 కేజీ, పెసరపప్పు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు, 
పచ్చిమిరపకాయలు: పావు కప్పు, అల్లం ముక్కలు: 1 టేబుల్ స్పూన్,  జీలకర్ర: 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు: 2 రెమ్మలు (సన్నగా తరిగినవి), ఉప్పు: 2.5 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా),  వెన్న: 2 టేబుల్ స్పూన్లు (వెన్నకు బదులుగా నూనెను కూడా వాడవచ్చు),  వేడి నీళ్లు: తగినంత (పిండి కలుపడానికి), నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి (పొడిది): 1 కేజీ, పెసరపప్పు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: పావు కప్పు, అల్లం ముక్కలు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు: 2 రెమ్మలు (సన్నగా తరిగినవి), ఉప్పు: 2.5 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా), వెన్న: 2 టేబుల్ స్పూన్లు (వెన్నకు బదులుగా నూనెను కూడా వాడవచ్చు), వేడి నీళ్లు: తగినంత (పిండి కలుపడానికి), నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.

1 / 5
పప్పులు నానబెట్టడం: ముందుగా ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును తీసుకోండి. వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి, కొన్ని నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టాలి. ఈ పప్పులు 1 కేజీ పిండికి సరిపోతాయి. పప్పులు నానే లోపు, ఒక మిక్సీ జార్‌లోకి పావు కప్పు పచ్చిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు తీసుకోండి. వీటిని మధ్య మధ్యలో ఆపుతూ, మరీ మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ పట్టుకోవాలి

2 / 5
 పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక బౌల్‌ను తీసుకొని, అందులోకి 1 కేజీ పొడి బియ్యప్పిండిని వేయాలి. ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టి నీళ్లు వంపేసిన పప్పులు, సన్నగా తరిగిన రెండు రెమ్మల కరివేపాకు, రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేయాలి. వెన్న వేయడం వల్ల చెక్కలు గుల్లగా, చాలా క్రిస్పీగా వస్తాయి. వెన్న లేకపోతే, కాచిన నూనెను కూడా వాడవచ్చు.

3 / 5
పిండికి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత, కొంచెం కొంచెంగా వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, కొద్దికొద్దిగా పోస్తూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్‌గా ఉంటే చెక్కలు నూనె పీల్చుకుంటాయి, మరీ గట్టిగా ఉంటే వత్తుకునేటప్పుడు క్రాక్స్ వస్తాయి. కాబట్టి, పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపినట్లుగా సరైన విధంగా ఉండాలి.

4 / 5
 పిండి కలుపుకున్నాక, దానిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత, పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని, పిండిలో నుండి నిమ్మకాయ సైజు అంత ఉండల్ని చేసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి.డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడెక్కేలోపు చెక్కల్ని వత్తుకోవాలి. ఒక ప్లాస్టిక్ షీట్‌కి ఆయిల్ రాసి, ఒక ఉండను తీసుకొని చేత్తో లేదా పూరీ ప్రెస్‌తో మధ్యస్థ మందంతో వత్తుకోవాలి. మరీ పల్చగా, మరీ మందంగా ఉండకూడదు.
ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక్కొక్క చెక్కను ఆయిల్ లో వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా, ఆయిల్ కి సరిపడినన్ని వేసుకోండి. ఇవి పైకి తేలే వరకు ఫ్రై చేసి, ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం వల్ల చెక్కలు అన్ని వైపులా ఈవెన్‌గా వేగుతాయి.

పిండి కలుపుకున్నాక, దానిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత, పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని, పిండిలో నుండి నిమ్మకాయ సైజు అంత ఉండల్ని చేసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి.డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడెక్కేలోపు చెక్కల్ని వత్తుకోవాలి. ఒక ప్లాస్టిక్ షీట్‌కి ఆయిల్ రాసి, ఒక ఉండను తీసుకొని చేత్తో లేదా పూరీ ప్రెస్‌తో మధ్యస్థ మందంతో వత్తుకోవాలి. మరీ పల్చగా, మరీ మందంగా ఉండకూడదు. ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక్కొక్క చెక్కను ఆయిల్ లో వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా, ఆయిల్ కి సరిపడినన్ని వేసుకోండి. ఇవి పైకి తేలే వరకు ఫ్రై చేసి, ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం వల్ల చెక్కలు అన్ని వైపులా ఈవెన్‌గా వేగుతాయి.

5 / 5
Follow Us