AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Zim: భారత్ చేతిలో మరో ఘోర పరాజయం.. జింబాబ్వే ఖాతాలో చెత్త రికార్డు

Ind vs Zim: మహిళల టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టు వరుసగా 23వ ఓటమిని ఎదుర్కొంది. భారత్‌తో జరిగిన మూడో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 91 పరుగులు, షెఫాలీ వర్మ 69 పరుగులు చేయడంతో టీమిండియా 92 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

Ind vs Zim: భారత్ చేతిలో మరో ఘోర పరాజయం.. జింబాబ్వే ఖాతాలో చెత్త రికార్డు
Zimbabwe Cricket
Rakesh
|

Updated on: Oct 21, 2026 | 9:29 AM

Share

Ind vs Zim: మహిళల టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టుకు వరుస ఓటములు వెంటాడుతున్నాయి. భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో ఆ జట్టు వరుసగా 23వ పరాజయాన్ని మూటగట్టుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అత్యధిక వరుస ఓటముల రికార్డు. మరోవైపు టీమిండియా అద్భుత ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అక్టోబర్ 20న రాయ్‌పూర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

హర్మన్‌ప్రీత్, షెఫాలీ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 41 బంతుల్లోనే 91 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ఓపెనర్ షెఫాలీ వర్మ 37 బంతుల్లో 69 పరుగులతో అదరగొట్టింది. అనుష్క శర్మ 28 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించింది. షెఫాలీ, హర్మన్‌ప్రీత్ వేగంగా పరుగులు సాధించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.

124 పరుగులకే పరిమితమైన జింబాబ్వే

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. షార్నే మేయర్స్ 60 పరుగులతో పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. భారత బౌలర్లలో నందిని శర్మ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో, రెండో టీ20లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ను 3-0తో ముగించింది.

వరుస ఓటముల్లో జింబాబ్వే తర్వాత ఎవరు?

ఫుల్ మెంబర్ దేశాల మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుస పరాజయాల జాబితాలో జింబాబ్వే 23 ఓటములతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2012 నుంచి 2014 మధ్య వరుసగా 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐర్లాండ్ 14 ఓటములతో తర్వాతి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు కూడా గతంలో వరుసగా 13 టీ20 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. అయితే ఈ గణాంకాలు ఫుల్ మెంబర్ దేశాలకు సంబంధించిన జాబితా మాత్రమే. అన్ని దేశాలను కలిపి చూస్తే జింబాబ్వే కంటే ఎక్కువ వరుస ఓటములు ఎదుర్కొన్న జట్లూ ఉన్నాయి.

భారత్‌తో సిరీస్‌లో జింబాబ్వేకు నిరాశ

జింబాబ్వే మహిళల జట్టుకు భారత్ పర్యటనలో తొలి టీ20లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపించినా, చివరకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, నందిని శర్మ బౌలింగ్‌తో విజయానికి బాటలు వేసింది. ఈ సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధించగా, జింబాబ్వే తన వరుస ఓటముల రికార్డును మరింత పెంచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్ చేతిలో మరో ఘోర పరాజయం.. జింబాబ్వే ఖాతాలో చెత్త రికార్డు
భారత్ చేతిలో మరో ఘోర పరాజయం.. జింబాబ్వే ఖాతాలో చెత్త రికార్డు
టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌..
టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌..
Video: వంటింట్లో మంటలు.. పార్సిల్ ఇచ్చిన డెలివరీ బాయ్‌ సాహసం!
Video: వంటింట్లో మంటలు.. పార్సిల్ ఇచ్చిన డెలివరీ బాయ్‌ సాహసం!
రీల్స్ వ్యామోహం..చిన్నారిని సముద్రపు అలలకు వదిలేసిన తల్లిదండ్రులు
రీల్స్ వ్యామోహం..చిన్నారిని సముద్రపు అలలకు వదిలేసిన తల్లిదండ్రులు
హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్‌ కల్చర్‌..!
హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్‌ కల్చర్‌..!
పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించలేదా..? భారీ మూల్యం తప్పదు..
పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించలేదా..? భారీ మూల్యం తప్పదు..
తేనెతో ఇలా ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే,వారం రోజుల్లో ముడతలు మాయం!
తేనెతో ఇలా ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే,వారం రోజుల్లో ముడతలు మాయం!
నా బట్టలు.. నా శరీరం.. నా ఇష్టం..! మీ పని మీరు చూసుకోండి..!!
నా బట్టలు.. నా శరీరం.. నా ఇష్టం..! మీ పని మీరు చూసుకోండి..!!
Video: 12వ అంతస్తు నుంచి వేలాడిన మూడేళ్ల చిన్నారి..!
Video: 12వ అంతస్తు నుంచి వేలాడిన మూడేళ్ల చిన్నారి..!
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే సక్సెస్ అవుతారా? ఇదే మీ విజయ రహస్యం..!
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే సక్సెస్ అవుతారా? ఇదే మీ విజయ రహస్యం..!