AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మినప అట్లు కంటే 10 రెట్లు ఎక్కువ.. రెండు తింటే.. ఎముకల పటుత్వాన్ని చిటికెలో తెచ్చి పెడుతుంది

ఈ రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, చాలామంది ఇవి గట్టిగా ఉంటాయని అనుకుంటారు. ఈ రెసిపీని ఇక్కడ చూసి ఇంట్లోనే మెత్తగా, నోరూరించే రాగి రొట్టెలను తయారు చేసుకోవచ్చు. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్స్‌తో పిల్లలు కూడా ఇష్టంగా తినేలా వీటిని తయారు చేయవచ్చు. ఇవి ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా కూడా బాగుంటాయి.

Prasanna Yadla
|

Updated on: Oct 21, 2026 | 7:17 AM

Share
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి: 1 కప్పు, నీరు: 1 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా,  ఉల్లిపాయ: 1 (మీడియం సైజు, సన్నగా తరిగినది), 
కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరిగినది),  కరివేపాకు:3 రెమ్మలు (సన్నగా తరిగినది),  పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), 
అల్లం: 1 అంగుళం ముక్క (తురిమినది), క్యారెట్ తురుము: 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం),  క్యాప్సికమ్: 1/2 (సన్నగా తరిగినది, ఐచ్ఛికం)
నూనె: కాల్చడానికి సరిపడా తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: రాగి పిండి: 1 కప్పు, నీరు: 1 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, ఉల్లిపాయ: 1 (మీడియం సైజు, సన్నగా తరిగినది), కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరిగినది), కరివేపాకు:3 రెమ్మలు (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం: 1 అంగుళం ముక్క (తురిమినది), క్యారెట్ తురుము: 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం), క్యాప్సికమ్: 1/2 (సన్నగా తరిగినది, ఐచ్ఛికం) నూనె: కాల్చడానికి సరిపడా తీసుకోవాలి.

1 / 5
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీటిని బాగా మరిగించి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. రాగి పిండికి ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక గిన్నెలో మనం నీరు తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మరిగించిన వేడి నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి.

2 / 5
ఒకేసారి నీరు మొత్తం పోయకూడదు. ఇలా వేడి నీటితో పిండిని కలపడం వల్ల రాగి పిండి మగ్గి, రొట్టెలు మెత్తగా.. వస్తాయి. ఇది రొట్టెలు విరిగిపోకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. పిండి కొద్దిగా చల్లారాక, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ రుచిని పెంచుతుంది, మీకు ఇష్టం లేకపోతే మినహాయించవచ్చు. వీటితో పాటు మునగాకు, మెంతికూర లేదా తోటకూర వంటి ఆకుకూరలను కూడా కలుపుకోవచ్చు.

3 / 5
వేసిన పదార్థాలన్నీ పిండికి బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, రొట్టెలు తట్టుకోవడానికి వీలుగా మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ లూజ్‌గా అనిపిస్తే, కొద్దిగా రాగి పిండిని కలుపుకోవచ్చు. పిండి ముద్ద మెత్తగా, ఉండలా తయారవ్వాలి.
 చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిలో నుంచి చిన్న ముద్దను తీసుకోవాలి. బటర్ పేపర్ లేదా తడి క్లాత్‌పై ఈ ముద్దను ఉంచి, పల్చగా రౌండ్‌గా రొట్టెలా ఒత్తుకోవాలి. రొట్టె మరీ మందంగా ఉండకూడదు, మందంగా ఉంటే సరిగా ఉడకదు. చివర్లు పగుళ్లు రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. రొట్టె మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అన్ని వైపులా బాగా కాలుతుంది.

వేసిన పదార్థాలన్నీ పిండికి బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, రొట్టెలు తట్టుకోవడానికి వీలుగా మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ లూజ్‌గా అనిపిస్తే, కొద్దిగా రాగి పిండిని కలుపుకోవచ్చు. పిండి ముద్ద మెత్తగా, ఉండలా తయారవ్వాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిలో నుంచి చిన్న ముద్దను తీసుకోవాలి. బటర్ పేపర్ లేదా తడి క్లాత్‌పై ఈ ముద్దను ఉంచి, పల్చగా రౌండ్‌గా రొట్టెలా ఒత్తుకోవాలి. రొట్టె మరీ మందంగా ఉండకూడదు, మందంగా ఉంటే సరిగా ఉడకదు. చివర్లు పగుళ్లు రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. రొట్టె మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అన్ని వైపులా బాగా కాలుతుంది.

4 / 5
పెనం బాగా వేడెక్కిన తర్వాత, బటర్ పేపర్‌పై ఉన్న రొట్టెను పెనంపై రివర్స్‌లో వేసి, నెమ్మదిగా బటర్ పేపర్‌ను తీసేయాలి. మంటను లో నుండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. రొట్టె మధ్యలో చేసిన రంధ్రాలలో కొద్దిగా నూనె వేయడం వల్ల అన్ని వైపులా బాగా వేగుతుంది. ఒక వైపు కాలిన తర్వాత, రెండో వైపుకు తిప్పుకుని బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత, రొట్టెను తీసి వేడివేడిగా వడ్డించుకోవాలి. మిగిలిన పిండితో ఇదే విధంగా రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఒక రొట్టె కాలుస్తుండగా, ఇంకొకటి సిద్ధం చేసుకుంటే పని త్వరగా పూర్తవుతుంది. ఈ మెత్తని రాగి రొట్టెలు చట్నీతో కానీ నేరుగా తిన్నా అద్భుతంగా ఉంటాయి.

5 / 5
Follow Us