AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ధోనీ కెప్టెన్​ కాకుంటే మరెన్నో రికార్డుల మోత మోగేది”

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​.. భార‌త మాజీ కెప్టెన్​ ధోనీపై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ టీమ్ కెప్టెన్​ కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగితే ఇంకా చాలా రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉండేదని తన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు.

ధోనీ కెప్టెన్​ కాకుంటే మరెన్నో రికార్డుల మోత మోగేది
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2020 | 5:16 PM

Share

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​.. భార‌త మాజీ కెప్టెన్​ ధోనీపై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ టీమ్ కెప్టెన్​ కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగితే ఇంకా చాలా రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉండేదని తన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు. ఎంతో చురుకౌన‌ ఆటగాడిగా ధోని ఉండేవాడని, కెప్టెన్సీని అత‌డు ఎప్పుడు భారంగా అనుకోలేద‌ని తెలిపాడు.

“వ‌ర‌ల్డ్ క్రికెట్​ ఒక మంచి ఛాన్స్ కోల్పోయింది. మ‌హీ 3వ స్థానంలో బ్యాటింగ్​ చేయ‌లేదు. ఒకవేళ మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి, కెప్టెన్ గా జ‌ట్టును ముందుకు నడిపించ‌క‌పోతే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​ పూర్తి భిన్నమైన మహీని చూసుండేది. ధోనీ ఇంకా చాలా రికార్డులు బద్దలు కొట్టేవాడేమో” అని గౌతమ్​ గంభీర్​ పేర్కొన్నాడు.

16 ఏళ్ల కెరీర్​లో ధోనీ వన్డేల్లో 10,773 ర‌న్స్ చేశాడు. వీటిలో 70 శాతం ర‌న్స్ నంబరు 4,5 స్థానాల్లో సాధించినవి. నాలుగులో వచ్చి 3,169 ర‌న్స్, ఐదో స్థానంలో 4,164 ప‌రుగులు చేెశాడు. ధోనీ మూడో స్థానంలో కేవలం 16 సార్లు బ్యాటింగ్​ చేసి 993 ప‌రుగులు సాధించాడు. మిగిలిన స్థానాలతో పోలిస్తే ధోనీ బ్యాటింగ్​ సగటు, స్ట్రైక్​ రేట్ థ‌ర్డ్ ప్లేసులోనే అత్యధికంగా 82.75, 99.69గా ఉంది. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.