
ఢిల్లీ : ట్రైలర్ లాంటి ఐపీఎల్ ఫీవర్‌తో మెన్నటివరకు ఊగిపోయిన క్రికెట్ ఫ్యాన్స్‌కు..ఫుల్ పిక్చర్‌గా భావించే ప్రపంచకప్ మే 30న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి టైటిల్ కొట్టే జట్ల గురించి సీనియర్ ప్లేయర్లు, మాజీ ఆటగాళ్లు, పలు దేశాలు మాజీ, ప్రస్తుత కోచ్‌లు ఒక్కో విధంగా స్పందిస్తున్నా.. తమ జట్లను ఫేవరెట్లుగా పేర్కొంటూనే ఇతర జట్ల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఇండియా, ఇంగ్లాండ్ తన రెండో ఫేవరెట్ జట్లని.. ఈసారి టైటిల్ కొట్టేది మాత్రం ఆస్ట్రేలియానే అని నమ్మకం వ్యక్తం చేశాడు. భారత జట్టు తరఫున కోహ్లీ, రోహిత్ భారీ స్కోర్లు నమోదు చేస్తారని జోస్యం చెప్పాడు గంభీర్. ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్‌లా ఉపయోగపడతాడని పేర్కొన్నాడు.
‘