AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ అభిమానం సల్లగుండా.. ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఇంటినే సేల్ చేసిన సూపర్ ఫ్యాన్.. ఎంతకో తెలుసా?

FIFA World Cup 2026: క్రీడల్లో గెలుపోటములు సహజం, కానీ ఇలాంటి వీరాభిమానుల గుండె చప్పుడు ఆ ఆటను మరింత అందంగా మారుస్తుంది. ఆండీ మిల్న్ చూపించిన ఈ అచంచలమైన ప్రేమ, ఇంగ్లాండ్ జట్టుకు ఈ ప్రపంచకప్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నీ అభిమానం సల్లగుండా.. ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఇంటినే సేల్ చేసిన సూపర్ ఫ్యాన్.. ఎంతకో తెలుసా?
England Andy Milne Sells House For Tickets
Venkata Chari
|

Updated on: May 27, 2026 | 4:42 PM

Share

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ఆటపై ఉన్న ఇష్టంతో కొందరు జెండాలు పట్టుకుని స్టేడియాలకు వస్తారు, మరికొందరు తమ అభిమాన ఆటగాళ్ల జెర్సీలు వేసుకుని కేరింతలు కొడతారు. కానీ, ఓ రిటైర్డ్ టీచర్ మాత్రం తన దేశం ఆడే మ్యాచ్‌లను కళ్లారా చూసేందుకు ఏకంగా తన సొంత ఇంటినే అమ్మేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ విస్తుపోయే ఘటన ఫిఫా వరల్డ్ కప్ 2026 వేళ వెలుగుచూసింది.

ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి సర్వం సిద్ధం..

ఈసారి జరగబోయే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 48 జట్లు ఈ మహాసంగ్రామంలో తలపడబోతున్నాయి. అంతేకాదు, అమెరికా, మెక్సికో, కెనడా వంటి మూడు దేశాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ ఫుట్‌బాల్ పండుగ 16 నగరాల్లో, మొత్తం 104 మ్యాచ్‌ల పాటు సాగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఫుట్‌బాల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది.

సాధారణ టీచర్.. అసాధారణమైన లవ్ స్టోరీ..!

ఈ అసాధారణ అభిమానానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు ఆండీ మిల్న్ (యాడమ్ మిల్న్). వృత్తిరీత్యా రిటైర్డ్ టీచర్ అయిన ఆండీకి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో తన అభిమాన జట్టు ఇంగ్లాండ్ ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నాడు. అయితే, అన్ని మ్యాచ్‌ల టికెట్లు, ప్రయాణ ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కావు. దీంతో ఏమాత్రం వెనకాడకుండా నార్త్‌విచ్‌లోని తన సొంత ఇంటిని సుమారు రూ. 4.5 కోట్లకు విక్రయించాడు. ఆ వచ్చిన డబ్బుతో ఇంగ్లాండ్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌ల టికెట్లను ముందుగానే కొనుగోలు చేశాడు.

ఇంగ్లాండ్ జట్టుకు ‘సూపర్ ఫ్యాన్’..

ఆండీ మిల్న్‌కు ఫుట్‌బాల్ ప్రపంచకప్ చూడటం ఇదే మొదటిసారి కాదు. ఆయనకు ఇది వరుసగా 10వ ప్రపంచకప్. దశాబ్దాలుగా ఇంగ్లాండ్ జట్టు ఎక్కడ ఆడినా వాలిపోయే ఆండీని అభిమానులంతా ‘సూపర్ ఫ్యాన్’ అని పిలుస్తారు. గతంలో 2022లో ఖతార్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనూ ఆండీ బాగా వైరల్ అయ్యాడు. ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీని పోలిన ‘జూల్స్ రిమెట్’ రెప్లికా ట్రోఫీని చేతుల్లో పట్టుకుని మైదానంలో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

తొలి పోరుకు డల్లాస్ చేరిన ఆండీ..

ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు జూన్ 17న క్రొయేషియాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కేవలం టికెట్లు కొనడమే కాకుండా, తన అభిమాన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఆండీ మిల్న్ అప్పుడే డల్లాస్ నగరానికి చేరుకోవడం విశేషం. ఇల్లు పోయినా పర్వాలేదు, తన దేశం ప్రపంచకప్ గెలిస్తే చాలనే ఈ ముసలాయన ఆరాటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us