Paris Olympics 2024: నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే

|

Jul 31, 2024 | 6:58 PM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకోవాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. కనీసం పతకం గెలవకపోయినా ఈ మెగా క్రీడల్లో పాల్గొంటే చాలని ఎదురు చూసే వారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు.

Paris Olympics 2024: నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే
Egyptian Fencer Nada Hafez
Follow us on

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకోవాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. కనీసం పతకం గెలవకపోయినా ఈ మెగా క్రీడల్లో పాల్గొంటే చాలని ఎదురు చూసే వారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్ వేదికపైనే మాతృత్వాన్ని చాటుకోవాలని, దీని ద్వారా మహిళలందరికీ సందేశం ఇవ్వాలని కలలు కంది. అయితే దురదృష్టవశాత్తూ హఫీజ్ 16వ రౌండ్‌లో ఓడిపోయింది. అయితేనేం గర్భం లేదా ప్రసవం ఒక మహిళ విజయానికి ఎలాంటి అడ్డంకి కాదని ఈ డేరింగ్ వుమన్ నిరూపించింది. అయితే తాను 7 నెలల గర్భవతి అయినప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్లు నాడా హఫీజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసేంత వరకు ఈ విషయం చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఆమె ధైర్యాన్ని, నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు.

ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల నాడా హఫీజ్ తన మూడో ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత సాబర్ ఈవెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ పోటీలో 26 ఏళ్ల హఫీజ్ తన తొలి మ్యాచ్‌లో 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై గెలిచింది. ఆ తర్వాత 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయాంగ్‌తో తలపడింది. అయితే ఈ రౌండ్ లో ఆమెకు ఓటమి ఎదురైంది. “సాధారణంగా ఒలింపిక్ వేదికపై ఇద్దరు ఆటగాళ్లు తలపడడం మీరు చూసి ఉండొచ్చు. కానీ ఈ వేదికపై మేం ముగ్గురం ఉన్నాం. నేను, నా ప్రత్యర్థి, అలాగే నా కడుపులోని పసి బిడ్డ. తాను ఇంకా మన ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు! నేను ఇప్పుడు 7 నెలల గర్భవతిని. కాబట్టి, ఈ పోటీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఈసారి నేను ఒక చిన్న ఒలింపియన్‌ను వేదికపైకి తీసుకువెళ్లాను’ అని నాడా హఫీజ్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నాడా హఫీజ్ ఎమోషనల్ పోస్ట్..

కాగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం హఫీజ్ కు ఇది మూడోసారి. ఇది వరకు ఆమె 2016 రియో ​​ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నూ పాల్గొంది. మాజీ జిమ్నాస్ట్ కూడా అయిన హఫీజ్ 2019 ఆఫ్రికన్ గేమ్స్‌లో వ్యక్తిగత, టీమ్ సాబర్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..