కరోనా ఎఫెక్ట్‌: కారును అమ్మకానికి పెట్టిన భారత స్ప్రింటర్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దీంతో ఆర్థికంగా అందరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కరోనా ఎఫెక్ట్‌: కారును అమ్మకానికి పెట్టిన భారత స్ప్రింటర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 4:28 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దీంతో ఆర్థికంగా అందరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సెలబ్రిటీలు సైతం డబ్బులు లేక తమ వస్తువులను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో అగ్రశేణి స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ తన విలువైన బీఎండబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్దమయ్యారు. ఫేస్‌బుక్‌లో తన కారు డిటైల్స్‌ను పెట్టిన ద్యుతీ చంద్‌.. ”నా కారును అమ్మాలనుకుంటున్నా. ఎవరైనా కొనాలనుకుంటే మెసేంజర్‌లో నన్ను సంప్రదించండి” అని పెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత ద్యుతీ చంద్‌ తన పోస్ట్‌ని డిలీట్ చేశారు.

దీనిపై ద్యుతీ మాట్లాడుతూ.. ‘టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలను మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్‌తోపాటు ఇతర ఖర్చులతో నాకు నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇప్పుడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా కారణంగా నా కోసం ఖర్చు చేయడానికి ఏ స్పాన్సర్‌ సిద్దంగా లేడు. కానీ  టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్న నాకు.. నా ఫిట్‌నెస్‌, జర్మనీలో శిక్షణ కోసం డబ్బులు కావాలి. అందుకే కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నా. మా ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి. అందులో ఓ కారును అమ్మాలనుకున్నా’ అని వివరించారు. ఇక ఈ కారును తానే స్వయంగా కొనుగోలు చేసినట్లు ద్యుతీ తెలిపారు.