కరోనా ఎఫెక్ట్: వింబుల్డన్‌ రద్దయినా.. ఆటగాళ్లకు దక్కనున్న ప్రైజ్‌మనీ..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని ఈవెంట్లు, పరీక్షలు రద్దయ్యాయి. టెన్నిస్ లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్

కరోనా ఎఫెక్ట్: వింబుల్డన్‌ రద్దయినా.. ఆటగాళ్లకు దక్కనున్న ప్రైజ్‌మనీ..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 5:51 AM

Wimbledon: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని ఈవెంట్లు, పరీక్షలు రద్దయ్యాయి. టెన్నిస్ లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ ఈ ఏడాదికి రద్దయిన సంగతి విదితమే. అయితే టోర్నీ జరగకపోయినా ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ దక్కనుంది. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు.

మరోవైపు.. ప్రతిష్ఠాత్మక గ్రాస్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌ టోర్నీకి బీమా సౌకర్యం ఉంది కాబట్టి.. మొత్తం ప్రైజ్‌మనీ 12.5 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 94 కోట్లు)ను ర్యాంకింగ్స్‌ ఆధారంగా టోర్నీకి అర్హులైన ఆటగాళ్లందరికీ పంచనున్నట్టు తెలిపారు. దీంతో పురుషులు, మహిళల సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల నుంచి మొత్తంగా 620 మంది క్రీడాకారులు లబ్ధి పొందనున్నారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు