Dhruvi: స్కేట్‌ బోర్డ్‌పై సెన్సేషన్.. ఏషియన్‌ గేమ్స్‌కి ఎంపికైన ధ్రువి.. తొలి తెలంగాణ ప్లేయర్‌గా రికార్డు

పిట్ట కొంచెం.. కూత ఘనం. ఈ సామెతకి సరిగ్గా సరిపోతోంది ఈ పదిహేనేళ్ల ధృవి . బేగంబజార్ కి చెందిన ధృవి.. గత ఏడేళ్లుగా ఎల్బీ స్టేడియంలో స్కేటింగ్ చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ మెడల్స్ సాధించిన ఈ చిచ్చర పిడుగు... ఇప్పుడు స్కేట్ బోర్డ్ లో ఏసియన్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన వన్ అండ్ ఓన్లీ తెలంగాణ ప్లేయర్ గా రికార్డ్ ని క్రియేట్ చేసేంది.

Dhruvi: స్కేట్‌ బోర్డ్‌పై సెన్సేషన్.. ఏషియన్‌ గేమ్స్‌కి ఎంపికైన ధ్రువి.. తొలి తెలంగాణ ప్లేయర్‌గా రికార్డు
Dhruvi Lakhotia

Edited By: Basha Shek

Updated on: Jul 19, 2023 | 2:43 PM

పిట్ట కొంచెం.. కూత ఘనం. ఈ సామెతకి సరిగ్గా సరిపోతోంది ఈ పదిహేనేళ్ల ధృవి . బేగంబజార్ కి చెందిన ధృవి.. గత ఏడేళ్లుగా ఎల్బీ స్టేడియంలో స్కేటింగ్ చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ మెడల్స్ సాధించిన ఈ చిచ్చర పిడుగు… ఇప్పుడు స్కేట్ బోర్డ్ లో ఏసియన్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన వన్ అండ్ ఓన్లీ తెలంగాణ ప్లేయర్ గా రికార్డ్ ని క్రియేట్ చేసేంది. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ స్కేటింగ్ అంటే పిచ్చి. పిచ్చి కంటే ప్రాణం అనాలేమో. ఎవరో ఫ్రెండ్ ఆడుతుంటే చూసిన ఈ అమ్మాయి… తానుకూడా స్కేట్ బోర్డ్ పై పరుగులు పెట్టాలనుకుంది. అనుకున్నది వాళ్ల నాన్నతో చెప్పింది. దీంతో ఎల్బీ స్టేడియంలోని శాట్స్ స్కేటింగ్ కోచ్ జితేందర్ గుప్తా దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్పీడ్ స్కేట్ బోర్డ్ పై పరుగులు పెట్టిన ధృవి… ఆ తర్వత రోలర్ హాకీ లో తన ప్రతిభ చాటుకుంది. అయితే అది నాన్ ఒలంపిక్ గేమ్ అవ్వడంతో… ధృవి ప్రతిభని గమనించిన కోచ్… ఒలంపిక్ గేమ్ అయిన స్కేట్ బోర్డ్ లోకి మార్చాడు

చదువులోనూ టాప్..

ఇక అందులో గత ఆరేళ్లుగా వరుసగా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో మెడల్స్ సాధించడంతో పాటు… 57వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో బ్రౌంజ్ మెడల్, 59వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ ని సాధించింది. ఇక ఏసియన్ గేమ్స్ కోసం సెలక్షన్స్ ట్రయల్స్ పాల్గొన్న 12 మంది అమ్మాయిల్లో ధృవినే నంబర్ ప్లేస్ సాధించి… ఏసియన్ గేమ్స్ కి అర్హత సాధించడం విశేషం.ధృవి ఏసియన్ గేమ్స్ లో సెలక్ట్ అవ్వడం గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం నవచైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ధృవి… చదవులోను టాప్ ఉందంటున్నారు. టెన్త్ క్లాస్ లో 9.7 సాధించిందన్నారు. ఇక స్కూల్ కి ఇప్పుడు కాలేజ్ కి రెగులర్ గా వెళ్తూనే…. ఎల్బీ స్టేడియంలో రోజకు ఉదయం ఐదగంటల నుంచి ఏడుగంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రాక్టీస్ చేస్తుందన్నాంటున్నారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిళీ అయినా… ధృవిలో ఉన్న పట్టుదలని చూసి ఏరోజు తమ ఇబ్బందల గురించి చెప్పలేదంటున్నారు.

ఎల్బీ స్టేడియంలో ఉన్న అరకోర వసతుల్లోనే ప్రాక్టీస్ చేస్తూ… రాష్ట్రం గర్వించే ప్లేయర్ గా ఎదుగుతోంది ధృవి. తమకు మరిన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తే.. తాను అంతర్జాతీయ స్థాయిలో మరిన్నీ మెడల్స్ తీసుకురావడంతో పాటు… తనలాంటి మరింతమంది ప్లేయర్లు తయారు అవుతారంటోంది.

ఇవి కూడా చదవండి

Dhruvi Lakhotia 1