AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌.. కోహ్లీ, జైస్వాల్‌ ఎక్కడున్నారంటే?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు.

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌.. కోహ్లీ, జైస్వాల్‌ ఎక్కడున్నారంటే?
Team India
Basha Shek
|

Updated on: Jul 19, 2023 | 5:09 PM

Share

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్‌ ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు.అలాగే ఈసారి టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే… భారత్‌ నుంచి హిట్‌మన్‌ మినహా మరే బ్యాటర్‌ టాప్-10లో కనిపించలేదు. 11వ స్థానంలో రిషబ్‌ పంత్‌ ఉండగా, విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. ఛటేశ్వర్‌ పుజారా 29వ ప్లేస్‌లో ఉండగా, రవీంద్ర జడేజా 38వ స్థానంలో ఉన్నారు. ఇటీవల అరంగేట్రంలోనే విండీస్‌పై సెంచరీ బాదిన యంగ్‌ సెన్సేషన్‌ యశస్వి జైస్వాల్‌ ఐసీసీ ర్యాంకిగ్స్ లో 73వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు.

టాప్‌-10 టెస్ట్‌ బ్యాటర్ల లిస్టు ఇదే..

1. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 883 పాయింట్లు

ఇవి కూడా చదవండి

2. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 874 పాయింట్లు

3. బాబర్ ఆజం (పాకిస్థాన్)- 862 పాయింట్లు

4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 855 పాయింట్లు

5. మార్నస్ లబుషేన్‌ (ఆస్ట్రేలియా)- 849 పాయింట్లు

6. జో రూట్ (ఇంగ్లండ్)- 842 పాయింట్లు

7. ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా)- 824 పాయింట్లు

8. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 792 పాయింట్లు

9. దిముత్ కరుణరత్నే (శ్రీలంక)- 780 పాయింట్లు

10. రోహిత్ శర్మ (భారత్)- 751 పాయింట్లు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?