అహాన్ని తగ్గించుకోడానికి… కోహ్లీ కసరత్తు!

అహాన్ని తగ్గించుకోడానికి... కోహ్లీ కసరత్తు!

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ భయపెట్టాడు. ఐదు వికెట్లు తీసి విండీస్ టాపార్‌ను కుప్పకూల్చాడు. శుక్రవారం భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూములో ఉన్న కోహ్లీ ఓ పుస్తకం చదువుతూ కనిపించాడు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2019 | 8:28 PM

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ భయపెట్టాడు. ఐదు వికెట్లు తీసి విండీస్ టాపార్‌ను కుప్పకూల్చాడు. శుక్రవారం భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూములో ఉన్న కోహ్లీ ఓ పుస్తకం చదువుతూ కనిపించాడు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పుస్తకం పేరు ‘డిటాక్స్ యువర్ ఇగో: 7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడం, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్’ (మీలోని అహాన్ని పారదోలండి: జీవితంలో స్వేచ్ఛ, సంతోషం, విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఏడు మార్గాలు).

విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కోహ్లీ అంటేనే అహానికి కేరాఫ్ అడ్రస్ లాంటివాడని. అతడు ఆ పుస్తకాన్ని చదవాల్సిందేనని అంటున్నారు. తనలోని అహాన్ని తగ్గించుకోవాలంటే ఈ పుస్తకం చదవడం ఒకే మార్గమని ఎవరో చెప్పి ఉంటారని, అందుకే కోహ్లీ అంత సీరియస్‌గా చదువుతున్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఆ పుస్తకం చదవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu