సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్!
గయానా: విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయకేతనం ఎగరవేసింది. రిషబ్ పంత్(65నాటౌట్; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(52; 45బంతుల్లో 6×4) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విండీస్ బౌలర్లలో థామస్ రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి మొదట […]
గయానా: విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయకేతనం ఎగరవేసింది. రిషబ్ పంత్(65నాటౌట్; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(52; 45బంతుల్లో 6×4) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విండీస్ బౌలర్లలో థామస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో పొలార్డ్(58), పావెల్(32) రాణించడంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 146 పరుగులు చేసింది. అటు దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టగా.. సైనీ రెండు వికెట్లు, రాహుల్ చాహర్ ఒక్క వికెట్ తీశారు.
Rishabh Pant finishes it off in style!
That’s that from Guyana as #TeamIndia win the third T20I by 7 wickets to clinch the three match T20I series 3-0 ?? pic.twitter.com/teSKCBtWBQ
— BCCI (@BCCI) August 6, 2019