Chahal-Dhanashree: భార్య ఫొటోలు డిలీట్ చేసిన క్రికెటర్ చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చినట్టేనా?

|

Jan 04, 2025 | 4:18 PM

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ఫేమస్ యూట్యూబర్ ధనశ్రీ వర్మల విడిపోనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ వార్తలకు బలం చేకురుస్తూ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇక చాహల్ అయితే తన సోషల్ మీడియా ఖాతాల్లో ధన‌శ్రీ ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.

Chahal-Dhanashree: భార్య ఫొటోలు డిలీట్ చేసిన  క్రికెటర్ చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చినట్టేనా?
Dhanashree Verma, Yuzvendra Chahal
Follow us on

టీమిండియా స్పిన్ బౌలర్ యుజువేంద్ర చాహల్, అతని భార్య ధన్‌శ్రీ వర్మల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తినట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా చాహల్, ధనశ్రీ లు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇక చాహల్ ధన‌శ్రీతో ఉన్న అన్ని ఫోటోలు, వీడియోలను కూడా తొలగించాడు. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. త్వరలో వీరిద్దరూ విడిపోవడం ఖాయమని అభిప్రాయానికి వచ్చేశారు. ఇక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చాహల్- ధనశ్రీలు విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అయితే విడాకుల విషయమై చాహల్ కానీ, ధనశ్రీ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

ఇవి కూడా చదవండి

కాగా చాహల్, ధనశ్రీ విడాకుల వార్తలు నిజమేనంటున్నారు వారి స్నేహితులు, సన్నిహితులు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ జంట విడిగానే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా చాహల్, ధన్‌శ్రీ వర్మల విడాకుల గురించి చాలా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీరిద్దరిపై చాలా పుకార్లు వచ్చాయి. ఆ సమయంలో, యుజువేంద్ర విడాకుల పుకార్లను కొట్టివేస్తూ ఒక నోట్‌ను పోస్ట్ చేశాడు. విడాకుల పుకార్లను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని అభిమానులను అభ్యర్థించాడు.

భర్త చాహల్ తో ధనశ్రీ వర్మ..

ఈ ఏడాది మొదటి జంట..

ప్రస్తుత రూమర్లే నిజమైతే ఈ ఏడాది విడాకులు తీసుకున్న తొలి స్టార్ జంట ఇదే అవుతుంది. గతేడాది టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా తన భార్య నుంచి విడిపోయాడు. ఇది కాకుండా సానియా మీర్జా, షోయబ్ మల్లిక్ కూడా విడాకులు తీసుకున్నారు.

చాహల్ తన భార్య  ధనశ్రీ ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. కానీ ధనశ్రీ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో చాహల్ ఫొటోలు అలాగే ఉండడం గమనార్హం.

భార్య ధనశ్రీతో చాహల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..