Year Ender 2023: ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 బౌలర్లు వీరే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారంటే?
ముఖ్యంగా 2023లో భారత బౌలర్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించారని చెప్పడంలో తప్పులేదు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఇందుకు నిదర్శనం. 2023లో భారత బౌలర్లు వన్డే ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా వికెట్ల పంట పండించారు. భారత బౌలర్లు ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో మొత్తం 289 వికెట్లు పడగొట్టారు

భారత క్రికెట్ జట్టు 2023లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాదిలో అత్యంత చేదు జ్ఞాపకం ఇదేనని చెప్పుకోవచ్చు. ప్రపంచకప్ ఫైనల్ సంగతి పక్కన పెడితే టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా క్రికెట్‌లో తమదైన ముద్రవేశారు. సీనియర్ ఆటగాళ్లతో పాటు యంగ్ ప్లేయర్లూ తమ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా 2023లో భారత బౌలర్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించారని చెప్పడంలో తప్పులేదు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఇందుకు నిదర్శనం. 2023లో భారత బౌలర్లు వన్డే ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా వికెట్ల పంట పండించారు. భారత బౌలర్లు ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో మొత్తం 289 వికెట్లు పడగొట్టారు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 1998లో 286 వికెట్లు తీసిన భారత్, 1999లో కూడా 283 వికెట్లు పడగొట్టి వరుసగా 2వ, 3వ స్థానాలను ఆక్రమించింది. ఈ ఏడాది టీమిండియా పేసర్లు సరాసరి 27.4 బంతులకు ఒక వికెట్ తీశారు. భారత్ మినహా మరే ఇతర జట్టు ఈ ఘనత సాధించలేదు.
ఈ ఏడాది భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లను విషయానికొస్తే.. 2023లో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఈ ఏడాది 30 మ్యాచుల్లో ఏకంగా 49 వికెట్లు పడగొట్టాడీ చైనామన్ బౌలర్. కుల్ దీప్ తర్వాత మహ్మద్ సిరాజ్ 25 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో నిలిచిన మహ్మద్ షమీ కేవలం 19 మ్యాచ్‌ల్లోనే 43 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఎస్. లమిచానే (43), షాహిన్ షా అఫ్రీదీ (42), హరీస్ రవూఫ్ (40), ఆడమ్ జంపా(38), మహేశ్ తీక్షణ (37), మార్కొ జాన్సెన్ (33), షోరీపుల్ ఇస్లాం (32) వికెట్లతో టాప్-10 లిస్టులో చోటు సంపాదించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరున్నారో తెలుసుకునేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి..
టాప్ ప్లేస్ లో కుల్ దీప్ యాదవ్
Our journey from Chennai to Ahmedabad ended in a disappointing result, but we take pride in our achievements over the six weeks. Despite the pain, we’re determined to work harder for the next opportunity.
Thanks to our dedicated support staff, we were fully prepared for every… pic.twitter.com/kz3ZdH0B3j
— Kuldeep yadav (@imkuldeep18) November 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..