Surya Kumar Yadav: ‘అయ్యో సూర్యా భాయ్’.. ఊత కర్ర సాయంతో అడుగులేస్తోన్న ‘మిస్టర్ 360’.. వైరల్ వీడియో
సూర్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో స్టార్ క్రికెటర్‌ను చూసిన అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఎడమ కాలి మడమకు పగుళ్లు ఏర్పడటంతో సూర్యకుమార్ యాదవ్.. కాలికి పట్టీ వేసుకుని కనిపించాడు సూర్య. అలాగే ఊత కర్ర సాయంతో మెల్లిమెల్లిగా అడుగులేస్తూ దర్శనమిచ్చాడు. ఈ వీడియోను షేర్ చేసిన సూర్య కుమార్'
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్య కుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మిస్టర్ 360 గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో ఆఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా ఆడలేకపోతున్నాడు. స్కానింగ్‌లో సూర్య గాయం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో సుమారు 7 వారాల పాటు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో సూర్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో స్టార్ క్రికెటర్‌ను చూసిన అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఎడమ కాలి మడమకు పగుళ్లు ఏర్పడటంతో సూర్యకుమార్ యాదవ్.. కాలికి పట్టీ వేసుకుని కనిపించాడు సూర్య. అలాగే ఊత కర్ర సాయంతో మెల్లిమెల్లిగా అడుగులేస్తూ దర్శనమిచ్చాడు. ఈ వీడియోను షేర్ చేసిన సూర్య కుమార్’కొంచెం సీరియస్‌గానే చెప్తున్నా.. గాయాలు అనేవి ఎప్పుడూ సరదాగా ఉండవు. కానీ నేను త్వరలోనే కోలుకుంటా.. మరింత బలంగా తిరిగొస్తాను’ అని ధీమాగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. టీమిండియా అభిమానులు, నెటిజన్లు సూర్య భాయ్.. త్వరగా కోలుకోని వచ్చేయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో సూర్య ఎంత కీలకమో అతని రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ నాటికల్లా సూర్య కుమార్ కోలువకోడం భారత్ కు అత్యంత కీలకం.
కాగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య కాలు బెణకడంతో మిస్టర్ 360 వెంటనే మైదానం వీడాడు. అయితే ఆ సమయంలో గాయం ప్రభావం పెద్దగా కనిపించలేదు. నడకలోనూ అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే స్వదేశానికి వచ్చిన తర్వాత స్కానింగ్ చేయించుకున్నాడు అసలు విషయం వెలుగుఓలకి వచ్చింది. అందులో గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తేలింద.ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడడంతో టీ20 కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ కు అప్పగించారు. అయితే ఇప్పుడు సూర్యకుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్ 2024 నాటికి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కోలుకోవడం టీమ్ ఇండియాకు చాలా కీలకం.
సూర్య కుమార్ యాదవ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..