Video: నీకసలు బుద్ధుందా? క్యాచ్‌లు వదిలేశావ్.. మ్యాచ్ పోయాలా ఉంది.. ఇవేం పనులు? జైస్వాల్‌పై ఫ్యాన్స్ సీరియస్
తొలి టెస్టులో భారత ఘోర పరాజయం తర్వాత యశస్వి జైస్వాల్ డ్యాన్స్ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. తన సెంచరీ తర్వాత కీలకమైన క్యాచ్‌లు వదిలేసిన జైస్వాల్, ఇంగ్లాండ్ విజయానికి చేరువలో ఉన్న సమయంలో డ్యాన్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జైస్వాల్ ప్రదర్శన, డ్యాన్స్‌పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పొందడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టీమిండియా బ్యాటర్లు ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 371 పరుగుల భారీ టార్గెట్‌ను ఆట చివరి రోజు భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ.. ఓ యంగ్ ప్లేయర్ మాత్రం క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో అనేక క్యాచ్‌లు వదిలేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న జైస్వాల్.. చేయకూడని టైమ్, చేయకూడని పని చేసి మరింత హేట్‌ను చవిచూస్తున్నాడు. ఇంతకీ జైస్వాల్ ఏం చేశాడంటే..
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా యశస్వి జైస్వాల్ బౌండరీ లైన్ వద్ద డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. అప్పటికీ టీమిండియా ఓటమికి చేరువైంది. ఇంగ్లాండ్ విజయానికి మరో 44 పరుగులు మాత్రమే అవసరం. భారత క్రికెటర్లు ముఖాలు నిరాశలో ఉన్నట్లు కనిపించాయి, భుజాలు కిందికి వాలాయి.. కానీ, అదే టైమ్‌లో జైస్వాల్ మాత్రం హ్యాపీగా ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల ముందు డ్యాన్స్ వేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు జైస్వాల్ తిట్టిపోస్తున్నారు. అసలు నీకు బుద్ధి ఉందా? మ్యాచ్‌లో పలు క్యాచ్‌లు వదిలేశావ్.. ఇప్పుడు కొంచెం కూడా బాధ లేకుండా డ్యాన్స్‌లు వేస్తున్నావా అంటూ అతనిపై మండిపడుతున్నారు.
జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ సెంచరీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కీలక సమయాల్లో ఫీల్డింగ్‌లో పదే పదే క్యాచ్‌లు వదిలేసి.. మ్యాచ్ ఓటమికి ఒక విధంగా అతనే ప్రధాన కారణంగా నిలిచాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత డకెట్ చెలరేగి ఆడి.. ఏకంగా 149 పరుగుల భారీ స్కోర్ కొట్టాడు. ఇలా జైస్వాల్ క్యాచ్‌లు డ్రాప్ చేసి అభిమానుల కోపం చవిచూడటమే కాకుండా.. డ్యాన్స్‌తో ఆ కోపాన్ని మరింత పెంచేశాడు. అసలు జైస్వాల్ అలా ఎందుకు చేశాడో ఎవరికి అర్థం కాలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టెస్ట్ చరిత్రలో రెండవ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ను ఇంగ్లాండ్ పూర్తి చేసి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. బెన్ డకెట్ 149 పరుగులతో ఆ జట్టును విజయం వైపు నడిపించాడు. జాక్ క్రాలే 65 పరుగులు, జో రూట్ (53 నాటౌట్), స్మిత్ (44 నాటౌట్) అజేయంగా 71 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ప్రశాంతంగా ముగించారు.
Yashasvi jaiswal casually dancing with crowd after dropping 7 catches in a single game.
Single handedly gave away the match to England. #INDvsENG#INDvENG pic.twitter.com/YWZ3pqxuVM
— News That Matters (@NewsMattersThat) June 24, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




