AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: బుమ్రా కావాలనే వికెట్లు తీయకుండా.. టీమిండియాను ఓడించాడా? ఛీ.. ఆ కోపంతోనే ఇలా చేశాడా?

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఐదు సెంచరీలు సాధించినా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత జస్ప్రీత్ బుమ్రాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం దీనికి కారణం. అయితే, బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు.

IND vs ENG: బుమ్రా కావాలనే వికెట్లు తీయకుండా.. టీమిండియాను ఓడించాడా? ఛీ.. ఆ కోపంతోనే ఇలా చేశాడా?
Gill And Bumrah
SN Pasha
|

Updated on: Jun 25, 2025 | 7:25 AM

Share

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించి.. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. మొత్తంగా రిషభ్‌ పంత్‌ రెండు సెంచరీలు కలుపుకొని ఐదు సెంచరీతు కొట్టారు. అయినా కూడా టీమిండియా గెలవలేకపోయింది. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఓ జట్టు ఐదు సెంచరీలు నమోదు చేసి మ్యాచ్‌ ఓడిపోవడం చరిత్రలో ఇదే మొదటి సారి. అంత చెత్త రికార్డును టీమిండియా మూటగట్టకుంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా ప్రధాన బౌలర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌ అంటూ కీర్తిప్రతిష్టతలు అందుకుంటున్న జస్ప్రీత్‌ బుమ్రాను కొంతమంది సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారు. బుమ్రా కావాలనే వికెట్లు తీయలేదని, తనకు కెప్టెన్సీ ఇవ్వలేదనే కోపంతోనే జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నాడంటూ.. బుమ్రాపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

అందుకు కారణం.. బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోవడం. ఈ పాయింట్‌ను పట్టుకొని.. బుమ్రాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రటించిన తర్వాత టీమిండియాకు బుమ్రా టెస్ట్‌ కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. గతంలో రోహిత్‌ లేని అందుబాటులో లేని సమయంలో బుమ్రాను జట్టును నడిపించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో కూడా బుమ్రా తొలి టెస్ట్‌కు కెప్టెన్సీ వహించి జట్టును గెలిపించాడు. సో.. బుమ్రానే నెక్ట్స్‌ కాబోయే టెస్ట్‌ కెప్టెన్‌ అని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా శుబ్‌మన్‌ గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని అందుకే బుమ్రాకు కాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చినట్లు సెలెక్టర్లు పేర్కొన్నారు. దీనిపై బుమ్రా అప్పుడు స్పందించలేదు.

కానీ, ఇటీవలె స్పందిస్తూ.. తాను అన్ని టెస్టులు ఆడనని, కెప్టెన్సీని తానే వద్దనుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. కానీ, నిజానికి బుమ్రా కెప్టెన్సీ ఆశించాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు ఇంగ్లాండ్‌ చేతిలో టీమిండియా ఓటమికి బుమ్రాను కొంతమంది బలిపశువును చేస్తున్నారు. నిజానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి హెల్ప్‌ లేకపోయినా.. బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్ల హల్‌ సాధించాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ పడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్‌ చేసిన బుమ్రా 57 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. అయితే టీమిండియా ఫీల్డర్లు సైతం భారీగా క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. పైగా టీమిండియా ఫీల్డర్లు భారీగా క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. అది కూడా వికెట్లు పడకపోవడానికి కారణం కావొచ్చు. అంతే కానీ.. బుమ్రా కావాలనే టీమిండియాను ఓడించాడు అనేది అర్థం లేని విమర్శగా చెప్పుకోవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి