IND Vs WI: ఐపీఎల్‌లో దుమ్ములేపారు.. కట్ చేస్తే.. హార్దిక్ కెప్టెన్సీలో టీ20 ఎంట్రీ.. వారెవరంటే.?

ఇప్పటికే టెస్టు సిరీస్ 1-0తో, వన్డే సిరీస్ 2-1తో కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి ఈ పొట్టి ఫార్మాట్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆకట్టుకున్న కొందరు యువ ప్లేయర్లు.. విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. మరో రైనా, మరో సెహ్వాగ్.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది.. వీరిద్దరూ తమ ప్రదర్శన కనబరిస్తే.. వన్డే ప్రపంచకప్‌కు అవకాశం దక్కించుకుంటారు.

IND Vs WI: ఐపీఎల్‌లో దుమ్ములేపారు.. కట్ చేస్తే.. హార్దిక్ కెప్టెన్సీలో టీ20 ఎంట్రీ.. వారెవరంటే.?
Ind Vs Wi

Updated on: Aug 03, 2023 | 12:23 PM

గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ట్రినాడాడ్ వేదికగా జరగనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జట్టు.. రోవ్‌మన్ పొవెల్ సారధ్యంలోని విండీస్‌ను ఢీకొడుతుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ 1-0తో, వన్డే సిరీస్ 2-1తో కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి ఈ పొట్టి ఫార్మాట్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆకట్టుకున్న కొందరు యువ ప్లేయర్లు.. విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ టాప్ రన్ గెట్టర్ యశస్వి జైస్వాల్, ముంబై ఇండియన్స్ అన్‌క్యాప్ద్‌ ప్లేయర్ తిలక్ వర్మ మొదటిసారిగా టీ20 జట్టులో ఎంపికయ్యారు. తొలి టీ20లో జైస్వాల్ ఓపెనర్‌గా, తిలక్ వర్మ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. వర్క్ లోడ్ తగ్గించే క్రమంలో శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి విశ్రాంతినిచ్చి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా ప్రయత్నించవచ్చు టీమ్ మేనేజ్‌మెంట్. వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న ఇషాన్‌కు విశ్రాంతినిస్తే.. అతడి స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ డ్యూటీలను చేపడతాడు.

రవీంద్ర జడేజా లేకపోవడంతో.. ప్రధాన స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ బాధ్యతలు చేపట్టనుండగా.. అర్ష్‌దీప్ సింగ్ పేస్ ఎటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. ఈ పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ పేసర్‌కు.. అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్‌ మద్దతుగా ఉంటారు. అలాగే టెస్టులు, వన్డేల్లో ఆకట్టుకున్న ముకేశ్‌ కుమార్‌కు టీ20ల్లో కూడా అవకాశం లభించవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌కు ఈసారి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

భారత జట్టు(అంచనా):

శుభ్‌మాన్ గిల్/ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.