AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM 5th T20I: ఒక్క బంతికి 13 పరుగులు.. 5వ టీ20లో జైస్వాల్ దూకుడు.. అసలేం జరిగిందంటే?

టీమిండియా తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ వికెట్‌ కోల్పోయింది. అతను సికందర్ రజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఔట్ కాకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికి 13 పరుగులు రాబట్టాడు. దీంతో మరోసారి ఫుల్ స్వింగ్‌లో కనిపించినట్లు అనిపించింది. కానీ, ఆ తర్వాత సికిందర్ రాజా విసిరిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. వార్తలు రాసే సమయానికి భారత జట్టు 2 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది.

IND vs ZIM 5th T20I: ఒక్క బంతికి 13 పరుగులు.. 5వ టీ20లో జైస్వాల్ దూకుడు.. అసలేం జరిగిందంటే?
Jaiswal
Venkata Chari
|

Updated on: Jul 14, 2024 | 5:13 PM

Share

IND vs ZIM 5th T20I: భారత్, జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఐదో మ్యాచ్ జరుగుతోంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత యువ జట్టు బ్యాటింగ్ చేస్తోంది.

టీమిండియా తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ వికెట్‌ కోల్పోయింది. అతను సికందర్ రజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఔట్ కాకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికి 13 పరుగులు రాబట్టాడు. దీంతో మరోసారి ఫుల్ స్వింగ్‌లో కనిపించినట్లు అనిపించింది. కానీ, ఆ తర్వాత సికిందర్ రాజా విసిరిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. వార్తలు రాసే సమయానికి భారత జట్టు 2 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది.

శుభ్‌మన్ గిల్ జట్టులో రెండు మార్పులు చేశాడు. ముఖేష్ కుమార్, రియోన్ పరాగ్‌లు జట్టులోకి వచ్చారు. ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు విశ్రాంతి లభించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

జైస్వాల్ 1 బంతికి 13 పరుగులు చేసి, ఆ తర్వాత బౌల్డ్..

ఈ మ్యాచ్ తొలి ఓవర్ లోనే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. జైస్వాల్ తన తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. అది నో బాల్. దీని తర్వాత ఫ్రీ హిట్‌పై జైస్వాల్ మళ్లీ సిక్సర్ బాదాడు. ఈ విధంగా అతను 1 బంతికి 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత, అదే ఓవర్ నాలుగో బంతికి రజా అతనిని బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్ తర్వాత భారత్ స్కోరు 15/1.

రెండు జట్లలో ప్లేయింగ్-11..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్), ఫరాజ్ అక్రమ్, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాండన్ మవుతా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us