
ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. బుధవారం మొదలైన ఫైనల్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాను ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానించి.. వాళ్లను కేవలం 212 పరుగులకే ఆలౌట్ చేసిన సౌతాఫ్రికా మంచి స్టార్ట్ అందుకుందని అంతా అనుకున్నారు. ప్రొటీస్ బౌలర్ కగిసో రబడా ఐదు వికెట్ల హాల్‌తో చెలరేగాడు. కానీ, బౌలర్ల కష్టానికి సౌతాఫ్రికా బ్యాటర్లు సరైన ఫలితం ఇవ్వలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏకంగా 6 వికెట్లతో రెచ్చిపోయాడు. మిచెల్ స్టార్క్ 2, జోస్ హెజల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హామ్ 111 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు, కెప్టెన్ బవుమా 84 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరు మినహా మరే బ్యాటర్ కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిల్చోలేకపోయారు. ఆట రెండో రోజు రెండో సెషన్‌లోనే రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 74 పరుగుల లీడ్ దక్కింది. మరి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మంచి బ్యాటింగ్ చేస్తే.. మ్యాచ్ వారి వైపే వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఇక ఆస్ట్రేలియాకు రెండో డబ్ల్యూటీసీ టైటిల్ ఖాయం అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అలా కాకుండా సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయి.. ఆస్ట్రేలియాను అతి తక్కువ స్కోర్‌కు ఆలౌట్ చేస్తే వారికి గెలిచే అవకాశం ఉంది. దాదాపు మూడో రోజు లేదా నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి విజేత ఎవరో తేలే అవకాశం ఉంది.
🚨 SIX WICKET HAUL FOR PAT CUMMINS IN THE WTC FINAL AGAINST SOUTH AFRICA 🚨 pic.twitter.com/9YTVU0i4on
— Johns. (@CricCrazyJohns) June 12, 2025
Bavuma #WTC2O25Final pic.twitter.com/hC5IgU5GAp
— Wasay Habib (@wwasay) June 12, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..