WPL చరిత్రలో లేడీ సెహ్వాగ్ వరల్డ్ రికార్డ్.. తొలి ప్లేయర్‌గా సంచలనం..!
Shafali Verma WPL Record: షెఫాలీ వర్మ ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ సీజన్‌లో ఆమె ఇప్పటికే 120 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ 21 ఏళ్ల యువ సంచలనం, డబ్ల్యూపీఎల్‌ను కూడా తన శాసనంగా మార్చుకుంటోంది.

Shafali Verma WPL Record: టీమ్ ఇండియా ‘లేడీ సెహ్వాగ్’గా పేరుగాంచిన షెఫాలీ వర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో అరుదైన ఘనత సాధించింది. తనదైన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించే ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, లీగ్ చరిత్రలో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో షెఫాలీ ఈ మైలురాయిని అధిగమించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల సునామీ మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ డైనమిక్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. నవీ ముంబై వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో షెఫాలీ 62 పరుగుల (41 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 4 భారీ సిక్సర్లు బాది, లీగ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 50 సిక్సర్ల మార్కును దాటేసింది.
సిక్సర్ల రాణి – షెఫాలీ: డబ్ల్యూపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి షెఫాలీ వర్మ తన పవర్ హిట్టింగ్‌తో అలరిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 31 మ్యాచ్‌ల్లో ఆమె మొత్తం 53 సిక్సర్లు పూర్తి చేసుకుంది. ఈ జాబితాలో ఆమె అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సోఫీ డివైన్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలు ఆమె వెనుక ఉన్నారు.
1000 పరుగుల మైలురాయికి చేరువలో: కేవలం సిక్సర్లే కాకుండా, పరుగుల పరంగానూ షెఫాలీ దూసుకుపోతోంది. తాజా ఇన్నింగ్స్‌తో ఆమె డబ్ల్యూపీఎల్‌లో 985 పరుగులకు చేరుకుంది. మరో 15 పరుగులు చేస్తే, నాట్ సివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, మెగ్ లానింగ్ తర్వాత 1000 పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో ప్లేయర్‌గా (రెండో భారతీయ బ్యాటర్‌గా) రికార్డు సృష్టిస్తుంది.
మ్యాచ్ హైలైట్స్: ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పటికీ, షెఫాలీ ఒంటరి పోరాటం చేసింది. పవర్‌ప్లేలో కేవలం 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కేవలం 27 బంతుల్లోనే తన 7వ డబ్ల్యూపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది.
